RPF Constable Recruitment 2023: రైల్వే శాఖలో 8,817 ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు.. 10th క్లాస్ పాసైతే చాలు
రైల్వే శాఖలో 8,817 RPF కానిస్టేబుల్ ఉద్యోగ ఖాళీలు ఉన్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. లోకసభ వేదికగా సభ్యులు అడిగిన ప్రశ్నకు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవి పై విధంగా సమాధానం ఇచ్చారు. రైల్వే శాఖలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF), రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ (RPSF) ఉద్యోగాలు 8,817 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. ఈ ఉద్యోగాలను రాబోయే రోజుల్లో భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు పురుష అభ్యర్థులు, మహిళా అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. పదవ తరగతి పాసైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. 18 నుంచి 25 సంవత్సరాల లోపు వయసు ఉండాలి, నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. రాత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ టెస్టుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
క్రింది PDF లింక్ పై క్లిక్ చేసి ఖాళీల వివరాలు తెలుసుకోగలరు
ప్రతిరోజు జాబ్ అప్డేట్స్ కోసం, క్రింది లింక్ పై క్లిక్ చేసి టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి👇