Railway Jobs: రైల్వే శాఖలో 4,232 ఖాళీ పోస్టుల భర్తీ నోటిఫికేషన్.. ఆంధ్రప్రదేశ్ లోని 22 జిల్లాల్లో ఖాళీలు
సికింద్రాబాద్ లోని రైల్వే నుంచి అప్రెంటిస్ ఖాళీల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 4,232 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 22 జిల్లాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. విశాఖపట్నం, విజయనగరం, మన్యం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన అభ్యర్థులు మినహా మిగతా జిల్లాలకు చెందిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. 10th క్లాస్ తో పాటు సంబంధిత ట్రేడ్ లో ఐటీఐ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం..
▶️Organization Details:
దక్షిణ మధ్య రైల్వే, సికింద్రాబాద్ లోని రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (RRC) నుంచి అప్రెంటిస్ ఖాళీల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలైంది.
▶️Vacancy Details:
అప్రెంటిస్ పోస్టులు: 4,232 ఖాళీలు
👉ట్రేడుల వారీగా ఖాళీల వివరాలు:
- ఏసీ మెకానిక్: 143
- ఎయిర్ కండిషనింగ్: 32
- కార్పెంటర్: 42
- డీజిల్ మెకానిక్: 142
- ఎలక్ట్రానిక్ మెకానిక్: 85
- ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్: 10
- ఎలక్ట్రీషియన్: 1053
- ఎలక్ట్రికల్ (ఎస్&టి ఎలక్ట్రీషియన్): 10
- పవర్ మెయింటెనెన్స్ (ఎలక్ట్రీషియన్): 34
- ట్రైన్ లైటింగ్ (ఎలక్ట్రీషియన్): 34
- ఫిట్టర్: 1742
- మోటార్ మెకానిక్ వెహికల్: 8
- మెకానిక్ మిషన్ టూల్ మెయింటెనెన్స్: 10
- పెయింటర్: 74
- వెల్డర్: 713
మొత్తం ఖాళీల సంఖ్య: 4,232
▶️Education Qualifications:
50% మార్కులతో 10వ తరగతి పాసై, సంబంధిత ట్రేడ్ లో ఐటిఐ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
▶️Age limit:
15 నుంచి 24 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
▶️Selection Process:
10th క్లాస్, ఐటిఐ లో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు, ఎలాంటి ఇంటర్వ్యూ ఉండదు.
▶️Apply Process:
- అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
- రూ.100 ఫీజు చెల్లించాలి.
- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
- 28-12-2024 తేదీ నుండి 27-01-2025 తేదీ లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉Note: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
✅నిరుద్యోగుల కోసం: TS SI/Constable.. TS ఫారెస్ట్ బీట్ ఆఫీసర్.. AP గ్రూప్-2 Mains.. AP SI/Constable.. AP ఫారెస్ట్ బీట్ ఆఫీసర్..SSC GD Constable “ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్” కేవలం “499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.