Job Mela: జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో డిసెంబర్ 1న మెగా జాబ్ మేళా నిర్వహణ
Job Mela: తెలంగాణ రాష్ట్రంలో 2025 డిసెంబర్ 1న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తారు. ములుగు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. మొత్తం 100 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ఎంపిక అయ్యే అభ్యర్థులు హైదరాబాద్ లోని టెలికాన్ఫరెన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో పని చేయవలసి ఉంటుంది.
Job Mela Details
పోస్టుల వివరాలు: ఈ జాబ్ మేళా ద్వారా హైదరాబాద్ లోని టెలికాన్ఫరెన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో 100 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
విద్యార్హతలు: డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు 2024 25 సంవత్సరంలో డిగ్రీ పూర్తయిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
Job Mela నిర్వహణ తేదీ:
- 01-12-2025 తేదీన ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు
- ఇంటర్వ్యూకి హాజరయ్యే అభ్యర్థులు 9618449360 ఫోన్ నెంబర్ కి సంప్రదించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి
- ఇంటర్వ్యూకి హాజరయ్యే అభ్యర్థులు తమ బయోడేటా, ఆధార్ కార్డు, విద్యార్హత పత్రాలను వెంట తీసుకొని వెళ్ళాలి
ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశము: 2025 డిసెంబర్ 1వ తారీఖున ములుగు లోని రీజినల్ సెంటర్ లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ములుగు జిల్లాకు సంబంధించిన అభ్యర్థులు ఇంటర్వ్యూలో పాల్గొనవచ్చు.

