Job Mela: ప్రభుత్వ సంస్థ ఆధ్వర్యంలో 2,300 ఉద్యోగాలు భర్తీకి మెగా జాబ్ మేళా నిర్వహణ
Job Mela: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2025 నవంబర్ 27 వ తారీఖున మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు.. డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. విజయనగరం జిల్లా నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు.. ఆంధ్రప్రదేశ్ నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఈ జాబ్ మేళా ద్వారా ప్రముఖ కంపెనీలలో 2,300 పైగా ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ, ఐటిఐ, డిప్లొమా, బిటెక్ అర్హతలు కలిగిన అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. ప్రముఖ కంపెనీలలో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
ఉద్యోగాలు భర్తీ చేస్తున్న సంస్థ
ఆంధ్రప్రదేశ్ నైపుణ్య అభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కల్పనా శాఖ ఆధ్వర్యంలో ప్రముఖ కంపెనీలలో 2,300 పైగా ఉద్యోగాలు భర్తీకి జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.
విద్యార్హతలు
10వ తరగతి, ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ, ఐటిఐ, డిప్లొమా, బిటెక్ అర్హతలు కలిగిన అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు.
వయోపరిమితి
18 నుంచి 45 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనుటకు అవకాశం ఉంటుంది.
ఇంటర్వ్యూ నిర్వహణ తేదీ
- 27-11-2025 తేదీన ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు
- ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు ముందుగా naipunyam.ap.gov.in వెబ్సైట్లో తమ వివరాలు నమోదు చేసుకోవాలి
- ఇంటర్వ్యూకు హాజరయ్య అభ్యర్థులు తమ బయోడేటా, ఆధార్ కార్డ్, విద్యార్హత పత్రాలను వెంట తీసుకొని వెళ్లాలి
ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశము
విజయనగరం జిల్లా: BVR Vocational College, Near Maruti Hospital, Nellimarla, Vizianagaram District.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

