10th క్లాస్ అర్హతతో ‘హోం శాఖలో’ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల
IB MTS Recruitment 2025: కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు చెందినటువంటి ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా 362 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. పదవతరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఖాళీలు ఉన్నాయి. కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు డిసెంబర్ 14వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.
పోస్టుల వివరాలు:
ఈ నోటిఫికేషన్ ద్వారా 362 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు హైదరాబాదులో ఆరు పోస్టులు విజయవాడలో మూడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి
వయోపరిమితి:
ఈ ఉద్యోగాలకు 2025 డిసెంబర్ 14వ తారీకు నాటికి 18 నుంచి 25 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు బిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
విద్యార్హతలు:
10వ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానం:
టైర్ వన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ టైర్ టు డిస్క్రిప్టివ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు
జీతభత్యాలు:
ఈ ఉద్యోగాలు పొందే అభ్యర్థులకు నెలకు జీతం రూ.18,000 నుంచి రూ.56,900 వరకు ఉంటుంది.
దరఖాస్తు విధానం:
అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 2025 నవంబర్ 22వ తారీకు నుంచి 2025 డిసెంబర్ 14 వ తారీకు వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.

