Government Jobs: 4,062 జూ.అసిస్టెంట్, అకౌంటెంట్, అటెండెంట్.. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | ఇంటర్, డిగ్రీ పాసైన వారు అర్హులు
దేశవ్యాప్తంగా ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో ఖాళీగా ఉన్న 4,062 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ నేతృత్వంలోని స్వయంప్రతిపత్తి సంస్థ నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ (NESTS) ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రిన్సిపల్, పీజీటీ, అకౌంటెంట్, జూనియర్ సెక్రెటేరియట్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 31వ తేదీలోపు www.emrs.tribal.gov.in పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు:
1.ప్రిన్సిపాల్: 303
2.పీజీటీ: 2266
3.అకౌంటెంట్: 361
4.జూనియర్ సెక్రెటేరియట్ అసిస్టెంట్: 759
5.ల్యాబ్ అటెండెంట్: 373
విద్యార్హతలు:
1.ప్రిన్సిపాల్:
మాస్టర్స్ డిగ్రీ, బీఈడీ డిగ్రీ మరియు అనుభవం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
2.పీజీటీ:
పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ మరియు బీఈడీ డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
( సబ్జెక్టుల వివరాలు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని తెలుసుకోండి)
3.అకౌంటెంట్:
బీకాం డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
4.జూనియర్ సెక్రెటేరియట్ అసిస్టెంట్:
ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై టైపింగ్ నాలెడ్జ్ కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
5.ల్యాబ్ అటెండెంట్:
ఇంటర్మీడియట్ లో సైన్స్ గ్రూప్ చదివిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. (లేదా)
10వ తరగతి పాసై డిప్లమా ఇన్ లాబోరేటరీ టెక్నిక్ సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు
వయోపరిమితి:
1.ప్రిన్సిపాల్:
50 సంవత్సరముల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు
2.పీజీటీ:
40 సంవత్సరముల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు
3.అకౌంటెంట్:
30 సంవత్సరముల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు
4.జూనియర్ సెక్రెటేరియట్ అసిస్టెంట్:
30 సంవత్సరముల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు
5.ల్యాబ్ అటెండెంట్:
30 సంవత్సరముల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు
అన్ని పోస్టులకు: SC/ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, BC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
జీతభత్యాలు:
1.ప్రిన్సిపాల్:
నెలకు Rs.78,800/- నుంచి Rs.2,09,200/- వరకు
2.పీజీటీ:
నెలకు Rs.47,600/- నుంచి Rs.1,51,100/- వరకు
3.అకౌంటెంట్:
నెలకు Rs.35,400/- నుంచి Rs.1,12,400/- వరకు
4.జూనియర్ సెక్రెటేరియట్ అసిస్టెంట్:
నెలకు Rs.19,900/- నుంచి Rs.63,200/- వరకు
5.ల్యాబ్ అటెండెంట్:
నెలకు Rs.18,000/- నుంచి Rs.56,900/- వరకు
అప్లికేషన్ ఫీజు/ పరీక్ష ఫీజు:
1.ప్రిన్సిపాల్: Rs.2000/-
2.పీజీటీ: Rs.1500/-
3.అకౌంటెంట్: Rs.1000/-
4.జూనియర్ సెక్రెటేరియట్ అసిస్టెంట్: Rs.1000/-
5.ల్యాబ్ అటెండెంట్: Rs.1000/-
ఎంపిక విధానం:
రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరి తేదీ:
2023 జూలై 31వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి
అతి తక్కువ ధరలో గ్రూప్-2 ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి