May 27, 2024
Police/Defence

9,360 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల… అర్హత, వయస్సు, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) నుంచి 9,212 కానిస్టేబుల్ (టెక్నికల్ & ట్రేడ్స్ మెన్) ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ పోస్టులకు అదనంగా మరో 148 పోస్టులను కలుపుతున్నట్లు CRPF అధికారిక ప్రకటన విడుదల చేసింది. దీంతో మొత్తం ఖాళీల సంఖ్య 9,360 కు చేరింది. అభ్యర్థుల వయోపరిమితిలో పలు మార్పులు చేసింది. అలాగే అభ్యర్థుల సౌలభ్యం కోసం దరఖాస్తు గడువును ‘మే’ 2 వరకు పొడగిస్తూ CRPF నిర్ణయం తీసుకుంది. ఎత్తు, ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్టుకు సంభందించి పలు మార్పులు చేసినట్లు పేర్కొంది. ఈ నోటిఫికేషన్ ద్వారా డ్రైవర్, మోటార్ మెకానిక్ వెహికల్, కోబ్లర్, కార్పెంటర్, టైలర్, బ్రాస్ బ్యాండ్, పైప్ బ్యాండ్, బగ్లర్, గార్డెనర్, పెయింటర్, కుక్, వాటర్ క్యారియర్, వాషర్ మెన్, బార్బర్, సఫాయి కర్మచారి విభాగాల్లో ఖాళీలు భర్తీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణ అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్రంలో కంప్యూటర్ ఆధారిత పరీక్షలు ఉంటాయి.

పోస్టుల వివరాలు:

కానిస్టేబుల్ (టెక్నికల్ & ట్రేడ్స్ మెన్) పోస్టులు: 9,360

దరఖాస్తు విధానం:

2023 మార్చి 27 నుండి 2023 మే 2 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. www.rect.crpf.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు:

Gen/OBC/EWS: Rs.100/-
SC/ST/Female: No Fee

విద్యార్హతలు:

పోస్టును అనుసరించి పదవ తరగతి, ఐటీఐ ఉత్తీర్ణత, హెవీ ట్రాన్స్పోర్ట్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. దీంతో పాటు నిర్ధిష్ట శారీరక ప్రమాణాలు ఉండాలి.

వయోపరిమితి:

కానిస్టేబుల్ డ్రైవర్ పోస్టులకు 21 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్నవారు, మిగతా కానిస్టేబుల్ అన్ని రకాల పోస్టులకు 18 నుంచి 26 సంవత్సరాల లోపు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. SC & ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, BC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

జీతభత్యాలు:

₹.21,700/- నుంచి ₹.69,100/- వరకు

ఎంపిక విధానం:

కంప్యూటర్ ఆధారిత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ & మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఫిజికల్ టెస్ట్ వివరాలు:

పురుషులు: హైట్- 165 cm
చెస్ట్- 77 cm (ఊపిరి పీల్చినప్పుడు 5 cm వరకు పెరగాలి)
మహిళలు: హైట్- 155 cm
ఎస్టీ స్త్రీ, పురుష అభ్యర్థులకు కొలతల్లో సడలింపు ఉంటుంది.

పరీక్ష విధానం:

ఒకే పేపర్ ఉంటుంది. 100 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇంగ్లీష్ మరియు హిందీ భాషల్లో పరీక్ష నిర్వహిస్తారు. కంప్యూటర్ ఆధారిత పరీక్షను 2023 జూలై 1 నుండి 2023 జూలై 13 వరకు నిర్వహిస్తారు.

పరీక్ష కేంద్రాలు:

ఆంధ్ర ప్రదేశ్ అభ్యర్థులకు అమలాపురం, అనంతపురం, బొబ్బిలి, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుత్తి, గుడ్లవల్లేరు గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, మదనపల్లె, మార్కాపురం, నంద్యాల, నెల్లూరు, ప్రొద్దుటూరు, పుట్టపర్తి, పుత్తూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తాడపత్రి, తిరుపతి, తిరువూరు, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం ప్రాంతాల్లో నిర్వహిస్తారు.

తెలంగాణ అభ్యర్థులకు ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, కొత్తగూడెం, మహబూబ్ నగర్, నల్గొండ, నర్సంపేట, నిజామాబాద్, సత్తుపల్లి, సూర్యాపేట, వరంగల్, వరంగల్ (అర్బన్) ప్రాంతాల్లో నిర్వహిస్తారు.

సిలబస్:

జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ & జనరల్ అవేర్నెస్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో విభాగం నుంచి 25 ప్రశ్నలు ఉంటాయి

క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోగలరు

Supplementary Notification

Full Notification

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!