APPSC Recruitment 2023: ఏపీపీఎస్సీ ద్వారా జూనియర్ అసిస్టెంట్, లైబ్రేరియన్ ఉద్యోగాల భర్తీకి అనుమతి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మరొక మంచి శుభవార్త తెలిపింది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(APPSC) ద్వారా డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వ విద్యాలయం, కాలుష్య నియంత్రణ మండలిలో 59 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీపీఎస్సీ ద్వారా డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. భర్తీ చేసే పోస్టుల్లో కాలుష్య నియంత్రణ మండలిలో 21 అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్స్, 18 గ్రేడ్-2 అనలిస్ట్, వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో 19 జూనియర్ అసిస్టెంట్, ఒక అసిస్టెంట్ లైబ్రేరియన్ పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనుంది.
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి
అతి తక్కువ ధరలో గ్రూప్-2, గ్రామ సచివాలయం, AP SI/Constable Mains ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.