APPSC Group-2: మార్చి మొదటి వారంలో గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్ష
APPSC Group-2 | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్-2 ప్రిలిమినరీ పరీక్షను ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి మొదటి వారంలో నిర్వహించనున్నారు.
✅నిరుద్యోగుల కోసం AP గ్రూప్-2, గ్రామ సచివాలయం టెస్ట్ సిరీస్ కేవలం “99 రూపాయలకే” అందించడం జరుగుతోంది. 600 పైగా టెస్టులు, PDFలు ఉంటాయి. టెస్ట్ సిరీస్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్-2 ప్రిలిమినరీ పరీక్షను 2024 ఫిబ్రవరి చివరివారం లేదా మార్చి మొదటి వారంలో నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ బోర్డు మెంబర్ పరిగే సుధీర్ గారు ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు. అభ్యర్థులు తమ ప్రిపరేషన్ కొనసాగించాలని తెలిపారు. గ్రూప్-2 నోటిఫికేషన్ త్వరలో విడుదల చేస్తామని తెలిపారు. 54 శాఖల్లో కేవలం 17 శాఖల నుంచి మాత్రమే ఇండెంట్లు అందాయని అందుకే గ్రూప్-2 నోటిఫికేషన్ ఆలస్యం అవుతోందని తెలిపారు. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల చేయడానికి ఏపీపీఎస్సీ సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు.
ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్-2 విభాగంలో 900 పోస్టులు భర్తీ చేయడానికి ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. గ్రూప్-2 నోటిఫికేషన్ ద్వారా డిప్యూటీ తహశీల్దార్, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3, సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్ 2, జూనియర్ అసిస్టెంట్, ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
✅నిరుద్యోగుల కోసం AP గ్రూప్-2, గ్రామ సచివాలయం టెస్ట్ సిరీస్ కేవలం “99 రూపాయలకే” అందించడం జరుగుతోంది. 600 పైగా టెస్టులు, PDFలు ఉంటాయి. టెస్ట్ సిరీస్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
✅ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి