September 11, 2024
AP Govt Jobs

APPSC | 212 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

APPSC: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఏపీలోని పలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 212 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలను గ్రూప్-2 నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసేందుకు అనుమతి తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఏపీలోని పలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 212 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలను గ్రూప్-2 నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఏపీపీఎస్సీ కి అనుమతినిస్తూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి అక్టోబర్ 20న ఉత్తర్వులు జారీ చేశారు. సాధారణ పరిపాలన శాఖ, వ్యవసాయ, పశు సంవర్ధక, ఉన్నత విద్య, హోం, మున్సిపల్, ప్రణాళిక, ప్లానింగ్, ఇతర శాఖల్లో ఈ పోస్టులు ఉన్నాయి. అత్యధికంగా ఏపీపీఎస్సీ కార్యాలయంలో 30, భూ పరిపాలన శాఖలో 31, పాఠశాల విద్యా శాఖకు చెందిన పరీక్షల విభాగంలో 20 చొప్పున ఈ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. గ్రూప్-2 నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేయాలని తెలిపింది. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూప్-2 సిలబస్ డౌన్లోడ్ చేసుకోండి

Group-2 Syllabus

ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి

Telegram Group Link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!