APPSC: ఏపీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే
APPSC: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల ఫలితాలను విడుదల చేశారు. ఏపీపీఎస్సీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే. మొత్తం 691 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన స్క్రీనింగ్ పరీక్షను సెప్టెంబర్ 7వ తారీఖున నిర్వహించారు. ఈ పరీక్షకు సంబంధించిన ఫలితాలను ఏపీపీఎస్సీ అధికారిక వెబ్సైట్లో విడుదల చేసింది. ఈ పరీక్షలో మొత్తం 13,845 మంది అభ్యర్థులు మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించారు. క్రింది లింక్ ద్వారా అభ్యర్థుల ఫలితాలను డౌన్లోడ్ చేసుకోగలరు.