APPSC: ఏపీ ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం.. జీతం: రూ.57,700/- | APPSC DL Notification 2024
APPSC DL Notification 2023: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో 290 లెక్చరర్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
✅నిరుద్యోగులకు రిపబ్లిక్ డే ఆఫర్: AP గ్రూప్-2 Full Course + Test Series కేవలం “399 రూపాయలకే” అందించడం జరుగుతోంది. 1022 వీడియోలు, 111 టెస్టులు, 106 PDFలు ఉంటాయి. Full Course + Test Series కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 290 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకు 2024 జనవరి 24వ తారీకు నుంచి 2024 ఫిబ్రవరి 13 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఏప్రిల్/మే నెలలో రాత పరీక్షలు నిర్వహిస్తారు. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..
పోస్టుల వివరాలు:
డిగ్రీ లెక్చరర్: 290 పోస్టులు
సబ్జెక్టుల వారీగా ఖాళీల వివరాలు:
1.బయోటెక్నాలజీ: 04
2.బోటనీ: 20
3.కెమిస్ట్రీ: 23
4.కామర్స్: 40
5.కంప్యూటర్ అప్లికేషన్స్: 49
6.కంప్యూటర్ సైన్స్: 48
7.ఎకనామిక్స్: 15
8.ఇంగ్లీష్: 05
9.హిస్టరీ: 15
10.మ్యాథమెటిక్స్: 25
11.మైక్రో బయాలజీ: 04
12.పొలిటికల్ సైన్స్: 15
13.తెలుగు: 07
14.జువాలజీ: 20
మొత్తం ఖాళీల సంఖ్య: 290
విద్యార్హతలు:
సంబంధిత సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీ, నెట్/ స్లెట్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
వయోపరిమితి:
2023 జూలై ఒకటవ తారీఖు నాటికి 18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
జీతభత్యాలు:
నెలకు రూ.57,700/- నుంచి రూ.1,82,400/- వరకు జీతం ఉంటుంది.
ఎంపిక విధానం:
కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్, కంప్యూటర్ ప్రొఫిసియన్సీ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:
ఏపీపీఎస్సీ వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరి తేదీ:
2024 ఫిబ్రవరి 13వ తారీకు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
✅నిరుద్యోగులకు రిపబ్లిక్ డే ఆఫర్: AP గ్రూప్-2 Full Course + Test Series కేవలం “399 రూపాయలకే” అందించడం జరుగుతోంది. 1022 వీడియోలు, 111 టెస్టులు, 106 PDFలు ఉంటాయి. Full Course + Test Series కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
✅ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి