AP Outsourcing Jobs: ఏపీలో 10th క్లాస్, డిగ్రీ అర్హతలతో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల
AP Outsourcing Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10th క్లాస్, డిగ్రీ అర్హతలతో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. శ్రీకాకుళం జిల్లా మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా డేటా ఎంట్రీ ఆపరేటర్, అటెండర్, ఆఫీస్ అటెండెంట్, MNO, FNO, డ్రైవర్.. తదితర ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు. మెరిట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలకు ఎంపిక అయ్యే అభ్యర్థులు శ్రీకాకుళం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నందు పనిచేయవలసి ఉంటుంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. అర్హత కలిగిన అభ్యర్థులు 2025 అక్టోబర్ ఒకటవ తారీకు లోపు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.