AP Outsourcing Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10th క్లాస్ అర్హతతో ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల
ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖలో కాంట్రాక్ట్/ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి డెంటల్ టెక్నీషియన్, ల్యాబ్ టెక్నీషియన్, ఎలక్ట్రీషియన్, కౌన్సిలర్, జనరల్ డ్యూటీ అటెండెంట్, పోస్టుమార్టం అసిస్టెంట్, థియేటర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష ఉండదు. విద్యార్హతలో వచ్చిన మార్కుల మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..
👉నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఉమ్మడి గుంటూరు జిల్లా, హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ (DCHS) కార్యాలయం నుంచి నోటిఫికేషన్ విడుదలైంది.
👉పోస్టుల వివరాలు:
1.డెంటల్ టెక్నీషియన్: 01 పోస్టు
2.ల్యాబ్ టెక్నీషియన్: 02 పోస్టులు
3.ఎలక్ట్రీషియన్: 02 పోస్టులు
4.కౌన్సిలర్: 01 పోస్టు
5.జనరల్ డ్యూటీ అటెండెంట్: 13 పోస్టులు
6.పోస్టుమార్టం అసిస్టెంట్: 03 పోస్టులు
7.థియేటర్ అసిస్టెంట్: 05 పోస్టులు
8.ఆఫీస్ సబార్డినేట్: 03 పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య: 30
👉విద్యార్హతలు:
పోస్టును అనుసరించి 10th Class, ITI, Diploma, DMLT/ B.Sc (MLT), BA (సోషల్ వర్క్) అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు
👉వయోపరిమితి:
18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
👉జీతభత్యాలు:
1.డెంటల్ టెక్నీషియన్: 32,670/-
2.ల్యాబ్ టెక్నీషియన్: 32,670/-
3.ఎలక్ట్రీషియన్: 18,500/-
4.కౌన్సిలర్: 21,500/-
5.జనరల్ డ్యూటీ అటెండెంట్: 15,000/-
6.పోస్టుమార్టం అసిస్టెంట్: 15,000/-
7.థియేటర్ అసిస్టెంట్: 15,000/-
8.ఆఫీస్ సబార్డినేట్: 15,000/-
👉ఎంపిక విధానం:
విద్యార్హతలో వచ్చిన మార్కుల మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు.
👉దరఖాస్తు విధానం:
అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉దరఖాస్తు ఫీజు/ పరీక్ష ఫీజు:
ఓసి అభ్యర్థులు రూ.500; బీసీ, ఎస్సీ, ఎస్టీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.300 ఫీజు చెల్లించాలి.
👉దరఖాస్తు తేదీలు:
10-03-2025 తేదీ నుండి 18-03-2025 తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి.
👉ముఖ్య గమనిక: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
👉క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
✅ AP Forest Beat Officer, AP SI/Constable, RRB Group-D ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.
✅ మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.