Job Mela: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2025 నవంబర్ 30 వ తారీఖున మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా, ఎలమంచిలి లోని SGA గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తారు. మొత్తం 19 కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొననున్నాయి. దాదాపు 1520 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు.. డైరెక్ట్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ, ఐటిఐ, డిప్లొమా, బీటెక్, పీజీ అర్హతలు కలిగిన అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు.
ముఖ్య గమనిక: జిల్లాలో జాబ్ మేళా నిర్వహించే అడ్రస్ వివరాల కొరకు, కంపెనీల వివరాల కొరకు, అర్హతల వివరాల కొరకు, జీతభత్యాల వివరాల కొరకు క్రింది నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.
ఉద్యోగాలు భర్తీ చేస్తున్న సంస్థ
ఏపీ నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఈ జాబ్ మేళా ద్వారా పలు కంపెనీలో మొత్తం 1520 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
Job Mela లో పాల్గొనే కంపెనీల వివరాలు
జాబ్ మేళాలో మొత్తం 19 కంపెనీలు పాల్గొననున్నాయి. దక్కన్ ఫైన్ కెమికల్స్ (ఇండియా ప్రైవేట్ లిమిటెడ్), MRF టైర్స్, టాటా ఎలక్ట్రానిక్స్, అపోలో ఫార్మసీ, మెడ్ ప్లస్, నవత రోడ్డు ట్రాన్స్పోర్ట్, గూగుల్ పే, పేటీఎం, సోలార్ పవర్ ప్లాంట్ ప్రైవేట్ లిమిటెడ్.. తదితర ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు.
విద్యార్హతలు
10వ తరగతి, ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ, ఐటిఐ, డిప్లొమా, బిటెక్, పీజీ, ఫార్మసీ అర్హతలు కలిగిన అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు.
Job Mela Age limit
18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థుల జాబ్ మేళాలో పాల్గొనవచ్చు .
ఇంటర్వ్యూ నిర్వహణ తేదీ
- 30-11-2025 తేదీన ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు
- ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు ముందుగా naipunyam.ap.gov.in వెబ్సైట్లో రిజిస్టర్ అవ్వాలి
- ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు తమ బయోడేటా, ఆధార్ కార్డు, పాన్ కార్డు, విద్యార్హత పత్రాలు జిరాక్స్ కాపీలను వెంట తీసుకొని వెళ్ళాలి.
Job Mela నిర్వహించే ప్రదేశము
అనకాపల్లి జిల్లా : S G A Government Degree College, Yelamanchili, Anakapalli District.
