Job Mela: రేపు మెగా జాబ్ మేళా నిర్వహణ.. 10th, ఇంటర్, డిగ్రీ అర్హతలు
Job Mela: ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) ఆధ్వర్యంలో రేపు మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఐటిఐ, డిప్లమా, బిటెక్, ఫార్మసీ అర్హతలు కలిగిన అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు .దాదాపు 17 కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొన్నానున్నాయి. రాత పరీక్ష ఉండదు, ఫీజు ఉండదు. డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
తేదీ సమయం
25-11-2025 తేదీ ఉదయం 9 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తారు. అర్హత కలిగిన అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు.
వేదిక
M.S.R Degree College, Co-operative Colony, Kavali, SPSR Nellore District.
విద్యార్హతలు
10వ తరగతి, ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ, ఐటిఐ, డిప్లొమా, బిటెక్, ఫార్మసీ అర్హతలు కలిగిన అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు.
వయోపరిమితి
జాబ్ మేళాలో పాల్గొనే అభ్యర్థులు 18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు పాల్గొనుటకు అవకాశం ఉంటుంది. పురుషులు, మహిళలు ఎవరైనా జాబ్ మేళాలో పాల్గొనవచ్చు.
జీతభత్యాలు
ఈ ఉద్యోగాలకు కంపెనీని, జాబ్ రోల్ ఆధారంగా రూ.10,000 నుంచి రూ.30,000 వరకు జీతం ఉంటుంది.
కంపెనీలు & ఖాళీల వివరాలు
జాబ్ మేళాలో మొత్తం 17 కంపెనీలు పాల్గొననున్నాయి. ఈ 17 కంపెనీల ద్వారా మొత్తం 986 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. కంపెనీల వివరాల కొరకు క్రింది నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.
దరఖాస్తు విధానం
జాబ్ మేళాలో పాల్గొనాలి అనుకునే అభ్యర్థులు ముందుగా naipunyam.ap.gov.in వెబ్సైట్లోకి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు మాత్రమే జాబ్ మేళాలో పాల్గొనుటకు అవకాశం ఉంటుంది.

