AP Government Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. అర్హత, వయస్సు, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. విజయవాడలోని ఏపీ SSC బోర్డు, డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ కార్యాలయం నుంచి ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన జూనియర్ అసిస్టెంట్ & డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగి ఉండి, కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
పోస్టుల వివరాలు:
1.జూనియర్ అసిస్టెంట్: 11 పోస్టులు
2.డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్: 01 పోస్టు
మొత్తం పోస్టులు: 12
జీతభత్యాలు:
జూనియర్ అసిస్టెంట్: రూ.18,500/-
డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్: రూ.18,500/-
విద్యార్హతలు:
ఏదైనా డిగ్రీ అర్హతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి. (ఎంఎస్ ఆఫీస్/ పీజీడీసీఏ/ డీసీఏ/ కంప్యూటర్ ఇంజినీరింగ్ సర్టిఫికేట్/ కంప్యూటర్ సబ్జెక్టుతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి).
వయోపరిమితి:
2023 జనవరి 1వ తారీకు నాటికి 18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
అప్లికేషన్ ఫీజు/ పరీక్ష ఫీజు:
రూ.500/- ఫీజు చెల్లించాలి
ఎంపిక ప్రక్రియ:
పదో తరగతి/ ఇంటర్మీడియట్/ డిగ్రీ మార్కులు, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ:
2023 జూలై 7వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.
ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల జాబితా వెల్లడి:
2023 జూలై 11 వ తారీఖున ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల చేస్తారు.
సర్టిఫికెట్ల వెరిఫికేషన్ తేదీ:
2023 జూలై 13, 14 తారీకుల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేస్తారు.
కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్:
2023 జూలై 16, 17 తారీకుల్లో కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ నిర్వహిస్తారు.
తుది ఎంపిక జాబితా వెల్లడి:
2023 జూలై 19వ తారీకున ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల తుది జాబితా విడుదల చేస్తారు.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
అతి తక్కువ ధరలో గ్రూప్-2, గ్రూప్-3, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, SSC GD Constable ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి