AP Job Calendar: లక్ష ఉద్యోగాలు భర్తీకి కసరత్తు
AP Job Calendar: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రభుత్వ రంగంలో విడుతల వారీగా లక్ష ఉద్యోగాలు భర్తీకి కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. శాఖల వారీగా ఖాళీల వివరాలు సేకరించే పనిలో ఉంది. వివిధ ప్రభుత్వ శాఖల్లో మంజూరైన పోస్టులు, ఖాళీలు, కాంట్రాక్టు ఉద్యోగుల వివరాలు సేకరిస్తోంది. ఈ లెక్కలు కొలిక్కి వచ్చిన తర్వాత కొత్త సంవత్సరంలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
శాఖల వారీగా ఖాళీల వివరాలు
ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం సేకరించిన ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి. రెవెన్యూ శాఖలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాల్సిన పోస్టులు 2,552 ఖాళీలు ఉన్నట్లు గుర్తించారు. ఉన్నత విద్యాశాఖలో 7వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సమాచారం. పట్టణ అభివృద్ధి శాఖలో డైరెక్టర్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాల్సిన పోస్టులు 23 వేల వరకు ఉన్నట్లు సమాచారం. నైపుణ్య అభివృద్ధి, శిక్షణా విభాగంలో 2600 పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాల్సినవి ఉన్నట్లుగా సమాచారం. అలాగే పంచాయతీరాజ్ శాఖలో 26వేల వరకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాల్సిన పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించారు. అలాగే వ్యవసాయ శాఖలో 2,400; మహిళా, శిశు, విభిన్న ప్రతిభావంతులు, సీనియర్ సిటిజన్స్ విభాగంలో 3వేల వరకు ఖాళీగా ఉన్నట్లు సమాచారం. మరికొన్ని శాఖల్లో ఖాళీల వివరాలు సేకరించాల్సి ఉంది. మొత్తంగా రానున్న మూడేళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీకి దశల వారీగా నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు సమాచారం.
పోలీస్ శాఖలో 11 వేలకు పైగా ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీకి అనుమతి కోరుతూ ఆ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే ప్రతిపాదనలు పంపిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే ఎస్సై, కానిస్టేబుల్ నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి.
▶️ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం క్రింది వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో జాయిన్ అవ్వండి

