AP Govt Jobs: ఏపీలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, డీఎస్సీ నోటిఫికేషన్లు విడుదలకు లైన్ క్లియర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త. కొత్త ఉద్యోగాలు భర్తీకి లైన్ క్లియర్ అయ్యింది. త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్.. తదితర ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదలకు మార్గం సుగమం అయ్యింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణపై నివేదిక సిద్ధమైంది. నివేదికను సీఎస్ కె.విజయానంద్ కు ఏకసభ్య కమిషన్ సభ్యుడు రాజీవ్ రంజన్ మిశ్రా మంగళవారం (మార్చి 11న) అందజేశారు.
సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణను అమలు చేసేందుకు ముందుగా ఏకసభ్య కమిషన్ ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ గతేడాది నవంబర్15న ఏర్పాటైంది. ఈ కమీషన్ ఎస్సీ వర్గీకరణలో భాగంగా ఉప వర్గాల్లో ఆర్థిక స్వావలంబన, తదితర అంశాలపై కమిషన్ అధ్యయనం చేసింది. ఈ కమిషన్ ఏపీలోని పలు ప్రాంతాల్లో విస్త్రతంగా పర్యటించింది. ఎస్సీ ఉప కులాల నుంచి అభిప్రాయాలను సేకరించింది. ఎస్పీ ఉప కులాల అభ్యర్థనలను కూడా సేకరించింది. ఈ నివేదికను త్వరలో కేబినెట్ ముందు ఉంచుతారు. దానిపై అసెంబ్లీలో చర్చ కూడా నిర్వహించే అవకాశం ఉంది. దీనిని కేబినెట్ అమోదించిన తర్వాత అమలులోకి వస్తుంది. తర్వాత ఉభయ సభలు దీనిని ఆమోదించాల్సి ఉంది. దీంతో త్వరలో వర్గీ కరణకు అనుగుణంగానే డీఎస్సీ నోటిఫికేషన్ కు, ఏపీపీఎస్సీ ద్వారా విడుదల చేసే పలు ఉద్యోగ నోటిఫికేషన్లకు లైన్ క్లియర్ అవుతోందని చెప్పవచ్చు.
✅ AP Forest Beat Officer, AP SI/Constable, RRB Group-D ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.
✅ మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.