AP District Court Office Subordinate Recruitment 2026: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కృష్ణాజిల్లా, మచిలీపట్నం డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నుంచి ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. 18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..
AP District Court Office Subordinate Recruitment 2026 Details
🏛️నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కృష్ణాజిల్లా, మచిలీపట్నం డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది.
🎯 పోస్టుల వివరాలు
ఈ నోటిఫికేషన్ ద్వారా అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఆఫీస్ సబార్డినేట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం మూడు పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.
- OC అభ్యర్థులకు: 02 పోస్టులు
- SC (Gr.2) అభ్యర్థులకు: 01 పోస్టు
💰 జీతభత్యాలు
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయ్యే అభ్యర్థులకు జీతం నెలకు రూ.15000/- (రెమ్యూనరేషన్) ఉంటుంది.
🎓 విద్యార్హతలు
7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
👉 వయోపరిమితి
ఈ ఉద్యోగాలకు 18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు, బీసీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
✅ ఎంపిక విధానం
విద్యార్హతలో వచ్చిన మార్కుల మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు, ఫీజు ఉండదు.
🌐 దరఖాస్తు విధానం
ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తు ఫారం కొరకు క్రింది నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
📃 జతపరచాల్సిన పత్రాలు
- విద్యార్హతకు సంబంధించిన సర్టిఫికెట్లు
- జనన తేదీ ధ్రువీకరణ పత్రం
- కుల ధ్రువీకరణ పత్రం (అవసరమైతే)
- ఇతర సంబంధిత సర్టిఫికెట్లు
- రూ.65/- స్టాంప్ తో సెల్ఫ్ అడ్రస్డ్ కవర్
- గెజిటెడ్ అధికారి అటెస్ట్ చేసిన పాస్పోర్ట్ సైజ్ ఫోటో దరఖాస్తు ఫారానికి అతికించాలి
- ధ్రువపత్రాలు గెజిటెడ్ అధికారిచే అటెస్ట్ చేసి ఉండాలి
📆 దరఖాస్తుకు చివరి తేదీ
17-02-2026 తేదీ లోపు అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.
✍️ దరఖాస్తులు పంపవలసిన చిరునామా
The Chairperson, District Legal Services Authority, Krishna District, Machilipatnam.
⚠️ ముఖ్య గమనిక
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు క్రింది నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని, పూర్తి వివరాలు తెలుసుకుని దరఖాస్తు చేసుకోగలరు.

