AP మంత్రుల కార్యాలయాల్లో అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. జీతం: రూ.30,000 | AP Government Jobs 2024
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రుల కార్యాలయాల్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. సోషల్ మీడియా విభాగంలో ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ప్రతి మంత్రి పేషీలో ఒక సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్, ఒక సోషల్ మీడియా అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 25 మంత్రుల ఆఫీసుల్లో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
ఏదైనా డిగ్రీ, B.Tech/ BE అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు 30 వేల నుంచి 50 వేల రూపాయల వరకు జీతం ఉంటుంది. ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ఎండి చైర్మన్ గా, సమాచార, పౌర సంబంధాల శాఖ అధికారులు, సబ్జెక్టు ఎక్స్పర్ట్ లు సభ్యులుగా ఉన్న కమిటీ అర్హులని ఎంపిక చేస్తుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం..
నోటిఫికేషన్ విడుదల చేసే సంస్థ:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సోషల్ మీడియా విభాగంలో ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కానుంది.
పోస్టుల వివరాలు:
ఎగ్జిక్యూటివ్ మరియు అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఒక్కో మంత్రి పేషీలో ఒక ఎగ్జిక్యూటివ్, ఒక అసిస్టెంట్ పోస్టు చొప్పున.. మొత్తం 25 మంత్రుల ఆఫీసుల్లో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
అర్హతల వివరాలు:
- ఎగ్జిక్యూటివ్: B.Tech
- అసిస్టెంట్: ఏదైనా డిగ్రీ
Age ఎంత ఉండాలి?
18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇవ్వనున్నారు.
Salary వివరాలు:
- ఎగ్జిక్యూటివ్: రూ.50,000
- అసిస్టెంట్: రూ.30,000
సెలక్షన్ ప్రాసెస్:
- ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
- ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ఎండి చైర్మన్ గా, సమాచార పౌర సంబంధాల శాఖ అధికారులు, సబ్జెక్ట్ ఎక్స్పెర్ట్ లు సభ్యులుగా ఉన్న కమిటీ అర్హులని ఎంపిక చేస్తుంది.
- ఎంపికైన అభ్యర్థులకు రెండు నెలల శిక్షణ ఉంటుంది.
Apply చేయు విధానం:
ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది. నోటిఫికేషన్ విడుదలైన తర్వాత దరఖాస్తు వివరాలను తెలుసుకోగలరు.
క్రింది లింక్ పై క్లిక్ చేసి పత్రికా ముఖంగా విడుదలైన నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు డౌన్లోడ్ చేసుకొని, పూర్తీ వివరాలు చదివి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి.
Notification Details