ఏపీ, తెలంగాణ ఎయిర్ పోర్టుల్లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | AAI Junior Assistant Notification 2023
AAI Recruitment 2023: చెన్నైలోని ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) నుండి సదరన్ రీజియన్ లోని వివిధ విమానాశ్రయాల్లో జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్మీడియట్, డిగ్రీ, డిప్లొమా విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం…
✅నిరుద్యోగుల కోసం AP గ్రూప్-2, గ్రామ సచివాలయం టెస్ట్ సిరీస్ కేవలం “99 రూపాయలకే” అందించడం జరుగుతోంది. 600 పైగా టెస్టులు, PDFలు ఉంటాయి. టెస్ట్ సిరీస్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
పోస్టుల వివరాలు:
1.జూనియర్ అసిస్టెంట్ (ఫైర్ సర్వీస్): 73 పోస్టులు
2.జూనియర్ అసిస్టెంట్ (ఆఫీస్): 02 పోస్టులు
3.సీనియర్ అసిస్టెంట్ (ఎలక్ట్రానిక్స్): 25 పోస్టులు
4.సీనియర్ అసిస్టెంట్ (అకౌంట్స్): 19 పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య: 119.
విద్యార్హతలు:
ఇంటర్మీడియట్, డిగ్రీ, డిప్లొమా అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి:
2023 డిసెంబర్ 20వ తారీకు నాటికి 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థుల దరఖాస్తు చేసుకోవచ్చు.
BC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు,
SC/ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
జీతభత్యాలు:
జూనియర్ అసిస్టెంట్:
రూ.31,000/- నుంచి రూ.92,000/- వరకు
సీనియర్ అసిస్టెంట్:
రూ.36,000/- నుంచి రూ.1,10,000/- వరకు
ఎంపిక విధానం:
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, కంప్యూటర్ లిటరసీ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్, డ్రైవింగ్ టెస్ట్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరి తేదీ:
2024 జనవరి 26వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
✅నిరుద్యోగుల కోసం AP గ్రూప్-2, గ్రామ సచివాలయం టెస్ట్ సిరీస్ కేవలం “99 రూపాయలకే” అందించడం జరుగుతోంది. 600 పైగా టెస్టులు, PDFలు ఉంటాయి. టెస్ట్ సిరీస్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
✅ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి