SSC GD Constable 2026 Notification Out for 25,487 Vacancies | Apply Online
SSC GD 2026 Notification: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి కానిస్టేబుల్ జీడీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 25,487 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPFs) & SSF విభాగాల్లో కానిస్టేబుల్ జీడీ పోస్టులు; అస్సాం రైఫిల్స్ లో రైఫిల్ మ్యాన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పురుష అభ్యర్థులు, మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. తెలుగు భాషలోనూ పరీక్ష ఉంటుంది. పదవ తరగతి పాసైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 2025 డిసెంబర్ 1వ తారీకు నుంచి 2025 డిసెంబర్ 31వ తారీకు వరకు ssc.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
SSC GD 2026 Notification Details
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. 2025 డిసెంబర్ ఒకటవ తారీఖున నోటిఫికేషన్ విడుదల చేశారు.
పోస్టుల వివరాలు
ఈ నోటిఫికేషన్ ద్వారా సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPFs) & SSF విభాగాల్లో కానిస్టేబుల్ జిడి పోస్టులు, అస్సాం రైఫిల్స్ లో రైఫిల్ మ్యాన్ జీడి పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 25,487 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.
విద్యార్హతలు
ఈ ఉద్యోగాలకు 10వ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది.
SSC GD 2026 Age limit
2026 జనవరి 1వ తారీఖు నాటికి 18 నుంచి 23 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, BC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
జీతభత్యాలు
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయ్యే అభ్యర్థులకు జీతం నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు ఉంటుంది.
సెలక్షన్ ప్రాసెస్
- కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, మెడికల్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
- పరీక్ష తెలుగు భాషలో కూడా ఉంటుంది. తెలుగు మీడియం అభ్యర్థులు తెలుగు భాషలో, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు ఇంగ్లీష్ భాషలో పరీక్ష రాయవచ్చు.
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పరీక్ష కేంద్రాలు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణ అభ్యర్థులు తెలంగాణ రాష్ట్రంలో పరీక్షలు రాయవచ్చు.
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: గుంటూరు, కర్నూలు, కాకినాడ, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, ఒంగోలు, ఏలూరు, హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్, కరీంనగర్, సిద్దిపేట.
- కంప్యూటర్ ఆధారిత పరీక్షలను 2026 ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో నిర్వహిస్తారు
సిలబస్ వివరాలు

Apply Process
అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ముందుగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అధికారిక వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత.. కానిస్టేబుల్ జిడి ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ఫారం నింపాలి.
Application Fee
రూ.100 ఫీజు చెల్లించాలి. మహిళా అభ్యర్థులు, ఎస్టీ అభ్యర్థులు, ఎస్సీ అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉండదు.
దరఖాస్తు తేదీలు
ఈ ఉద్యోగాలకు 2025 డిసెంబర్ 1వ తారీకు నుంచి 2025 డిసెంబర్ 31వ తారీకు వరకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది.

