Job Mela in Andhra Pradesh: ఏపీలో మెగా జాబ్ మేళా నిర్వహణ.. రాతపరీక్ష లేకుండా ఉద్యోగాలు భర్తీ
Job Mela: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లా, గుంటూరు తూర్పు నియోజకవర్గం లోని ఆంధ్ర ముస్లిం కాలేజీ నందు 2025 డిసెంబర్ 3వ తారీఖున మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. మొత్తం 32 కంపెనీల్లో దాదాపు 900 వరకు ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళా జరుగుతుంది. గుంటూరు జిల్లాలోని యువతి యువకులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు.. డైరెక్ట్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ, ఐటిఐ, డిప్లొమా, బిటెక్, పీజీ, ఫార్మసీ అర్హతలు కలిగిన అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు.
ముఖ్య గమనిక: జాబ్ మేళా నిర్వహించే అడ్రస్ వివరాల కొరకు, కంపెనీల వివరాల కొరకు, అర్హతల వివరాల కొరకు, జీతభత్యాల వివరాల కొరకు క్రింది నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.
Job Mela నిర్వహించే సంస్థ
ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు
Job mela లో పాల్గొనే కంపెనీల వివరాలు
జాబ్ మేళాలో మొత్తం 32 కంపెనీలు పాల్గొననున్నాయి. జాయ్ అలుకాస్, ముత్తూట్ ఫైనాన్స్, అపోలో ఫార్మసీ, మాస్టర్ మైండ్స్, మెడ్ ప్లస్, ఆదిత్య బిర్లా, పేటీఎం, జయలక్ష్మి ఆటోమోటివ్స్,… తదితర 32 ప్రముఖ కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొననున్నాయి.
విద్యార్హతలు
10వ తరగతి, ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ, ఐటిఐ, డిప్లొమా, బిటెక్, పీజీ, ఫార్మసీ అర్హతలు కలిగిన అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు.
Age limit
18 నుంచి 35 సంవత్సరాలు లోపు ఉన్న అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు .
Job Mela నిర్వహణ తేదీ
- 03-12-2025 తేదీన ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు
- ఇంటర్వ్యూకి హాజరయ్యే అభ్యర్థులు ముందుగా naipunyam.ap.gov.in వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాలి
- ఇంటర్వ్యూకి హాజరయ్యా అభ్యర్థులు తమ బయోడేటా, ఆధార్ కార్డు, పాన్ కార్డు, విద్యార్హత పత్రాలు జిరాక్స్ కాపీలను వెంట తీసుకొని వెళ్లాలి
ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశము
గుంటూరు జిల్లా : Andhra Muslim College, Guntur – Ponnur Road, Guntur.

