APPSC: 48వేల జీతంతో అటవీ శాఖలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | APPSC FRO Notification 2024
APPSC FRO Recruitment 2024: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటవీ శాఖలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది.
✅నిరుద్యోగుల కోసం “AP ఫారెస్ట్ బీట్ ఆఫీసర్” ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. 1129 వీడియోలు, 105 టెస్టులు, 199 PDF Files ఉంటాయి. ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటవీ శాఖలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 37 పోస్టులను భర్తీ చేస్తున్నారు. డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 26 జిల్లాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష, ఫిజికల్ టెస్టుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత, వయస్సు, జీతం, సిలబస్, ఫిజికల్ టెస్టులు, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..
పోస్టుల వివరాలు:
ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్: 37 పోస్టులు
జోన్ల వారీగా ఖాళీల వివరాలు:
Zone-1: 08
Zone-2: 11
Zone-3: 10
Zone-4: 08
విద్యార్హతలు:
డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అగ్రికల్చర్, బోటనీ, కెమిస్ట్రీ, కంప్యూటర్ అప్లికేషన్స్/ కంప్యూటర్ సైన్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఫారెస్ట్రీ, జియాలజీ, హార్టికల్చర్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్, వెటర్నరీ సైన్స్, జువాలజీ సబ్జెక్టులలో ఏదో ఒక సబ్జెక్టు కలిగి డిగ్రీ పూర్తయిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. (లేదా)
డిగ్రీలో అగ్రికల్చర్ ఇంజనీరింగ్/ కెమికల్ ఇంజనీరింగ్/ సివిల్ ఇంజనీరింగ్/ కంప్యూటర్ ఇంజనీరింగ్/ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్/ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్/ మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి:
18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
SC/ST/BC/EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
జీతభత్యాలు:
నెలకు రూ.48,450/- నుంచి రూ.1,37,220/- వరకు జీతం ఉంటుంది.
ఫిజికల్ టెస్టుల వివరాలు:
ఫిజికల్ స్టాండర్డ్ టెస్టులు:
Height:
Male:163 Cms.
Female: 150 Cms.
Chest:
Male: 79 Cms.
Female: 74 Cms.
Minimum Expansion: 5 Cms.
ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టులు:
Walking Test:
Male:
25 kms in 4 hours
Female:
16 kms in 4 hours
ఎంపిక విధానం:
స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్స్ పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, కంప్యూటర్ ప్రొఫిసియన్సీ టెస్ట్, మెడికల్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
సిలబస్:
స్క్రీనింగ్ టెస్ట్:
స్క్రీనింగ్ పరీక్షను 150 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ప్రశ్నపత్రంలో పార్ట్-ఎ జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ మరియు మ్యాథమెటిక్స్ నుంచి 75 ప్రశ్నలు, పార్ట్-బి జనరల్ ఫారెస్ట్రీ-1&2 నుంచి 75 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 150 మార్కులకు స్క్రీనింగ్ పరీక్ష ఉంటుంది.
మెయిన్స్ పరీక్ష:
మెయిన్స్ పరీక్షలను 600 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ఇందులో నాలుగు పేపర్లు ఉంటాయి. పేపర్-1 పరీక్షలో జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ నుంచి 150 ప్రశ్నలు వస్తాయి. పేపర్-2 పరీక్షలో మ్యాథమెటిక్స్ నుంచి 150 ప్రశ్నలు వస్తాయి. పేపర్-3 పరీక్షలో జనరల్ ఫారెస్ట్రీ-1 నుంచి 150 ప్రశ్నలు వస్తాయి. పేపర్-4 పరీక్షలో జనరల్ ఫారెస్ట్రీ-2 నుంచి 150 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 600 మార్కులకు మెయిన్స్ పరీక్షలను నిర్వహిస్తారు.
అలాగే జనరల్ ఇంగ్లీష్ (50 మార్కులకు) & జనరల్ తెలుగు (50 మార్కులకు) పరీక్షను 100 మార్కులకు నిర్వహిస్తారు. ఈ పరీక్షలో అభ్యర్థులు ఇంగ్లీష్, తెలుగు సబ్జెక్టులలో క్వాలిఫై మార్కులు తెచ్చుకోవాలి. ఈ పరీక్ష కేవలం క్వాలిఫైయింగ్ టెస్ట్ మాత్రమే.
దరఖాస్తు విధానం:
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:
2024 ఏప్రిల్ 15వ తారీకు నుంచి ఏపీపీఎస్సీ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తుకు చివరి తేదీ:
2024 మే 5వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
✅నిరుద్యోగుల కోసం “AP ఫారెస్ట్ బీట్ ఆఫీసర్” ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. 1129 వీడియోలు, 105 టెస్టులు, 199 PDF Files ఉంటాయి. ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.