Hostel Warden Jobs: హాస్టల్ వార్డెన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. 6,329 పోస్టులు.. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు
దేశవ్యాప్తంగా ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో (EMRS) ఖాళీగా ఉన్న 6,329 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ (NESTS) ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (TGT), హాస్టల్ వార్డెన్ (Male), హాస్టల్ వార్డెన్ (Female) పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు గడువు మరో రెండు రోజుల్లో ముగియనుంది. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 18వ తేదీలోపు www.emrs.tribal.gov.in పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు:
1.టీజీటీ: 5,660 పోస్టులు
2.హాస్టల్ వార్డెన్(Male): 335 పోస్టులు
3.హాస్టల్ వార్డెన్(Female): 334 పోస్టులు
మొత్తం పోస్టులు: 6,329
విద్యార్హతలు:
1.టీజీటీ:
సంబంధిత సబ్జెక్టులో బ్యాచిలర్ డిగ్రీ, బీఈడీ అర్హతలతో పాటు సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET) క్వాలిఫై అయిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
2.హాస్టల్ వార్డెన్(Male):
ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
3.హాస్టల్ వార్డెన్(Female):
ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి:
35 సంవత్సరముల లోపు ఉన్న అభ్యర్థుల దరఖాస్తు చేసుకోవచ్చు.
అన్ని పోస్టులకు: SC/ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, BC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
జీతభత్యాలు:
1.టీజీటీ:
నెలకు Rs.44,900/- నుంచి Rs.1,42,400/-
2.హాస్టల్ వార్డెన్:
నెలకు Rs.29,200/- నుంచి Rs.92,300/-
అప్లికేషన్ ఫీజు/ పరీక్ష ఫీజు:
1.టీజీటీ: Rs.1500/-
2.హాస్టల్ వార్డెన్: Rs.1000/-
ఎంపిక విధానం:
రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరి తేదీ:
2023 ఆగస్టు 18వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి
అతి తక్కువ ధరలో గ్రూప్-2, గ్రూప్-3, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి