January 15, 2025
TS Govt Jobs

TSPSC Group 2:- గ్రూప్-2 రాత పరీక్ష తేదీ ఖరారు

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-2 పరీక్షను షెడ్యూల్ ప్రకారమే నిర్వహించనున్నారు. ఆగస్టు 29,30 తేదీల్లో గ్రూప్-2 పరీక్ష జరగనున్నది. కొందరు అభ్యర్థులు గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని కమిషన్ ను ఆశ్రయిస్తున్న విషయం తెలిసిందే. కానీ టీఎస్పీఎస్సీ మాత్రం ముందుగా నిర్ణయించినటువంటి షెడ్యూల్ ప్రకారమే గ్రూప్-2 పరీక్షను నిర్వహించాలని భావిస్తున్నది.

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-2 పరీక్షను షెడ్యూల్ ప్రకారమే నిర్వహించనున్నారు. ఆగస్టు 29,30 తేదీల్లో గ్రూప్-2 పరీక్ష జరగనున్నది. కొందరు అభ్యర్థులు గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని కమిషన్ ను ఆశ్రయిస్తున్న విషయం తెలిసిందే. కానీ టీఎస్పీఎస్సీ మాత్రం ముందుగా నిర్ణయించినటువంటి షెడ్యూల్ ప్రకారమే గ్రూప్-2 పరీక్షను నిర్వహించాలని భావిస్తున్నది. గ్రూప్-3 పరీక్ష తేదీల ఖరారుతోపాటు గ్రూప్-1 మెయిన్స్, కళాశాల లెక్చరర్లు, సంక్షేమ వసతిగృహాల అధికారులు (హెచ్ బ్ల్యూవో), డివిజినల్ అకౌంట్స్ ఆఫీసర్ (డీఏవో) పరీక్షల నిర్వహణకు టీఎస్పీఎస్సీ ముమ్మర కసరత్తు చేస్తున్నది. ఈ నేపథ్యంలో కొందరు అభ్యర్థులు గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని కమిషన్ ను ఆశ్రయిస్తున్నారు. ఇదే సమయంలో గ్రూప్-2 పరీక్షలకు సీరియస్ గా సన్నద్ధమయ్యే మరి కొంతమంది అభ్యర్థులు మాత్రం పరీక్షలను వాయిదా వేయొద్దని కోరుతున్నారు. ఈ ఏడాది చివరి వరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన పలు పరీక్షలు జరుగుతుండటం, అక్టోబర్ లో దసరా సెలవులు ఉండటం, ఆ తర్వాత నవంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో షెడ్యూల్ ప్రకారమే గ్రూప్-2 పరీక్ష నిర్వహించాలని అభ్యర్థిస్తున్నారు. దీంతో టీఎస్పీఎస్సీ సైతం ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే గ్రూప్-2 పరీక్ష నిర్వహించాలని భావిస్తున్నది. ఇప్పటికే గ్రూప్-3 పరీక్ష నిర్వహణకు తేదీలు అందుబాటులో లేవు. సంక్షేమ వస తిగృహాల అధికారులు, డీఏవో పరీక్షలదీ ఇదే పరిస్థితి. మరోవైపు గ్రూప్-1 మెయిన్స్ తేదీల ఖరారు టీఎస్పీఎస్సీకి పెద్ద పరీక్షగా మారింది. ఇటువంటి తరుణంలో గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయడం సాధ్యం కాదని ఇటీవల జరిగిన సమావేశంలో కమిషన్ అభిప్రాయపడింది. ఒకసారి పరీక్షను వాయిదావేస్తే మళ్లీ ఈ ఏడాది నిర్వహించడం కష్టమేనని, కనుక ఆగస్టు 29, 30 తేదీల్లోనే గ్రూప్-2 పరీక్ష నిర్వహించాలని కమిషన్ నిర్ణయించినట్టు సమాచారం.

ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి

Telegram Group Link

అతి తక్కువ ధరలో గ్రూప్-2, గ్రూప్-3, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, SSC GD Constable ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి

APP Link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!