TS Police Jobs: వారంలో తెలంగాణ ఎస్ఐ ఫలితాలు?.. ఆ తర్వాత కానిస్టేబుల్..
తెలంగాణ రాష్ట్రంలో పోలీసు ఉద్యోగార్థుల ఎంపిక ప్రక్రియపై కసరత్తు తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాల తుది ఎంపిక జాబితా మరో వారం రోజుల్లో విడుదల చేసే అవకాశం ఉంది.
తెలంగాణ రాష్ట్రంలో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగార్థుల ఎంపిక ప్రక్రియపై కసరత్తు తుదిదశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ పూర్తి కావడంతో తుదిజాబితా ప్రకటించడమే మిగిలి ఉంది. పోలీస్ కొలువుల భర్తీ ప్రక్రియలో భాగంగా తొలుత సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితా ప్రకటించేందుకు తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి సన్నద్ధమవుతోంది. వారం రోజుల్లోనే ఎస్సై తుదిఎంపిక జాబితా విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వివిధ విభాగాల్లోని ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులకు కలిపి మొత్తం 97,175 మంది అభ్యర్థులు ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యారు. ఈ ప్రక్రియ సైతం గత నెల 26వ తేదీనే పూర్తి చేసినట్టు బోర్డు అధికారులు ప్రకటించారు. ఆయా రిజర్వేషన్ కేటగిరీ, రోస్టర్ పాయింట్లు, మల్టీ జోన్లు… ఇలా మొత్తం 180 అంశాలను పరిగణనలోకి తీసుకుని ఎస్సై పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల తుదిజాబితా విడుదల చేయాల్సి ఉంటుంది.
వివిధ విభాగాల్లో మొత్తం 579 ఎస్సై ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. వీటన్నింటికీ వారం రోజుల్లో తుదిఎంపిక అభ్యర్థుల జాబితా విడుదల కానున్నట్టు సమాచారం. ఎస్సై తుదిఎంపిక అభ్యర్థుల జాబితా విడుదలైన తర్వాత వారి వ్యక్తిగత ప్రవర్తన, నేరచరిత్రపై వారి స్వస్థలాల్లోని పోలీస్ స్టేషన్ల నుంచి వివరాలు సేకరించి పరిశీలించాల్సి ఉంటుంది. అన్నీ సరిగా ఉన్నవారికి ఉద్యోగ నియామకపత్రం అందుతుంది. వారినే శిక్షణకు పంపుతారు. ఎంక్వైరీ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులు యోచిస్తున్నారు. అన్ని సకాలంలో పూర్తి చేసి ఆగస్టు నుంచి ఎస్సైల శిక్షణ ప్రారంభించేలా అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఎస్సై తుది ఎంపిక జాబితా విడుదల చేసిన మరి కొద్ది రోజులకు కానిస్టేబుల్ తుది ఎంపిక జాబితా విడుదల చేయనున్నారు.
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి
అతి తక్కువ ధరలో గ్రూప్-2, గ్రూప్-3, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, SSC GD Constable ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి