AP District Court Jobs: ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టులో ఆఫీస్ సబార్డినేట్, రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నుంచి ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఆఫీస్ సబార్డినేట్, రికార్డ్ అసిస్టెంట్, టైపిస్ట్ కమ్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
పోస్టుల వివరాలు:
ఆఫీస్ సబార్డినేట్-3, రికార్డ్ అసిస్టెంట్-1, టైపిస్ట్ కం అసిస్టెంట్-2, స్టెనోగ్రాఫర్-1
విద్యార్హతలు:
ఆఫీస్ సబార్డినేట్: 7వ తరగతి విద్యార్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు
రికార్డ్ అసిస్టెంట్: ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు
టైపిస్ట్ కం అసిస్టెంట్: ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగి ఉండి టైప్ రైటింగ్ ఎగ్జామినేషన్ హయ్యర్ గ్రేడ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. MS-Office కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
స్టెనోగ్రాఫర్: ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగి ఉండి, షార్ట్ హ్యాండ్ మరియు టైప్ రైటింగ్ ఎగ్జామినేషన్ హయ్యర్ గ్రేడ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. MS-Office కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
వయోపరిమితి:
12-04-2023 నాటికి 18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
జీతభత్యాలు:
టైపిస్ట్ కం అసిస్టెంట్ మరియు స్టెనోగ్రాఫర్ పోస్టులకు రూ.18,550/-
రికార్డ్ అసిస్టెంట్ మరియు ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు రూ.15,000/-
ఎంపిక విధానం:
స్టెనోగ్రాఫర్ మరియు టైపిస్టు పోస్టులకు స్కిల్ టెస్ట్ ఆధారంగా, అలాగే ఆఫీస్ సబార్డినేట్ మరియు రికార్డ్ అసిస్టెంట్ పోస్టులకు ఓరల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:
Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 2023 మే 15వ తారీకు సాయంత్రం ఐదు గంటల లోపు దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులు పంపవలసిన చిరునామా:
చైర్మన్, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, డిస్ట్రిక్ట్ కోర్ట్ కాంప్లెక్స్, అనంతపురం.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ మరియు దరఖాస్తు ఫారం డౌన్లోడ్ చేసుకోగలరు
Notification & Application form