Postal Jobs: 40,889 గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాలు.. రెండు రోజుల్లో ముగియనున్న దరఖాస్తు గడువు
పోస్టల్ సర్కిళ్లలో 40,889 గ్రామీణ డాక్ సేవక్ (GDS) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు గడువు మరో రెండు రోజుల్లో ముగియనుంది. పదవ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. పదవ తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్/ డాక్ సేవక్ హోదాలతో పని చేయాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2480, తెలంగాణ రాష్ట్రంలో 1266 ఖాళీలు ఉన్నాయి. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 2023 ఫిబ్రవరి 16వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి.
పోస్టుల వివరాలు:
గ్రామీణ డాక్ సేవక్ మొత్తం పోస్టులు: 40,889
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీలు: 2,480
తెలంగాణ రాష్ట్రంలో ఖాళీలు: 1,266
వయోపరిమితి:
2023 ఫిబ్రవరి 16వ తేదీ నాటికి 18 నుంచి 40 సంవత్సరాలలోపు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు దివ్యాంగులకు పదేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
విద్యార్హతలు:
పదవ తరగతి పాసై ఉండాలి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వారు తెలుగు సబ్జెక్టు పదవ తరగతి వరకు చదివి ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి.
జీతభత్యాలు:
BPM పోస్టులకు: రూ.12,000/- నుంచి రూ.29,380/-
ABPM/ డాక్ సేవక్: రూ.10,000/- నుంచి 24,470/-
ఎంపిక విధానం:
పదవ తరగతిలో సాధించిన మార్కుల మెరిట్ మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:
ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
2023 జనవరి 27వ తారీకు నుంచి 2023 ఫిబ్రవరి 16వ తారీకు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి