December 20, 2024
All India Govt JobsPolice/Defence

CRPF: 1315 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ | అర్హత, వయస్సు, సిలబస్, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం వివరాలు

సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) నుంచి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (స్టెనో), హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 1,458 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణ అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్రంలో కంప్యూటర్ ఆధారిత పరీక్షలు ఉంటాయి.

పోస్టుల వివరాలు:

అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్: 143 పోస్టులు,
హెడ్ కానిస్టేబుల్: 1,315 పోస్టులు.
మొత్తం 1,458 పోస్టులు భర్తీ.

ASI, హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు విధానం:

2023 జనవరి 4 నుండి 2023 జనవరి 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. www.crpf.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు:

Gen/OBC/EWS: Rs.100/-
SC/ST/Female: No Fee

విద్యార్హతలు:

ఇంటర్మీడియట్ (10+2) అర్హత కలిగిన వారు లేదా దానికి సరి సమానమైన విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఏఎస్ఐ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు స్టెనోగ్రఫీ వచ్చి ఉండాలి, హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు కంప్యూటర్ పై టైపింగ్ నాలెడ్జ్ ఉండాలి.

వయోపరిమితి:

2023 జనవరి 31 నాటికి 18 నుంచి 28 సంవత్సరాల లోపు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. SC & ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, BC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

జీతభత్యాలు:

అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు- రూ.29,200/- నుంచి రూ.92,300/- వరకు
హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు- రూ.25,500/- నుండి రూ.81,100/- వరకు ఉంటుంది.

ఎంపిక విధానం:

కంప్యూటర్ ఆధారిత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ & మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఫిజికల్ టెస్ట్ వివరాలు:

పురుషులు: హైట్- 165.0 cm
చెస్ట్- 77 cm (ఊపిరి పీల్చినప్పుడు 82 cm వరకు పెరగాలి)
మహిళలు: హైట్- 155.0 cm
ఎస్టీ స్త్రీ, పురుష అభ్యర్థులకు కొలతల్లో సడలింపు ఉంటుంది.

పరీక్ష విధానం:

ఒకే పేపర్ ఉంటుంది. 100 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇంగ్లీష్ మరియు హిందీ భాషల్లో పరీక్ష నిర్వహిస్తారు. కంప్యూటర్ ఆధారిత పరీక్షను 2023 ఫిబ్రవరి 22 నుండి 2023 ఫిబ్రవరి 28 వరకు నిర్వహిస్తారు.

పరీక్ష కేంద్రాలు:

ఆంధ్ర ప్రదేశ్ అభ్యర్థులకు అమలాపురం, అనంతపురం, బొబ్బిలి, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుత్తి, గుడ్లవల్లేరు గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, మదనపల్లె, మార్కాపురం, నంద్యాల, నెల్లూరు, ప్రొద్దుటూరు, పుట్టపర్తి, పుత్తూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తాడపత్రి, తిరుపతి, తిరువూరు, విజయవాడ ప్రాంతాల్లో నిర్వహిస్తారు.
తెలంగాణ అభ్యర్థులకు ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, కొత్తగూడెం, మహబూబ్ నగర్, నల్గొండ, నర్సంపేట, నిజామాబాద్, సత్తుపల్లి, సూర్యాపేట, వరంగల్ వరంగల్ (అర్బన్) ప్రాంతాల్లో నిర్వహిస్తారు.

సిలబస్:

ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ ఆప్టిట్యూడ్, క్వాంటిటీవ్ ఆప్టిట్యూడ్, జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి ప్రశ్నలు ఉంటాయి ఒక్కో విభాగం నుంచి 25 ప్రశ్నలు ఉంటాయి

క్రింది నోటిఫికేషన్ లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోగలరు.

Website

Notification Link

Last Date Extended & Age limit Increased Notice

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!