APPSC Group 2 New Syllabus 2023 | గ్రూప్ 2 పరీక్ష విధానం మరియు సిలబస్ PDF
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఎపిపిఎస్సి) గ్రూప్-2 పరీక్షలకు కొత్త సిలబస్ ను విడుదల చేసింది. మొత్తం 450 మార్కులకు గాను రెండు దశల రాతపరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మొదటి దశలో 150 మార్కులకు ప్రిలిమ్స్ (స్క్రీనింగ్) పరీక్ష , రెండో దశలో 300 మార్కులకు మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. ప్రిలిమ్స్ పరీక్షలో అర్హుత సాధించిన అభ్యర్ధులు మాత్రమే మెయిన్ పరీక్ష రాయడానికి అర్హులు.
గ్రూప్-2 సిలబస్:
ప్రిలిమ్స్ (స్క్రీనింగ్ టెస్ట్): జనరల్ స్టడీస్ మరియు మెంటల్ఎబిలిటీ నుంచి 150 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 150 మార్కులకు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. స్క్రీనింగ్ టెస్ట్ లో క్వాలిఫై అయిన అభ్యర్థులు మెయిన్ పరీక్షకు అర్హత వహిస్తారు.
మెయిన్స్: మెయిన్స్ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి.
పేపర్-1:
- ఆంధ్రప్రదేశ్ సామాజిక సాంస్కృతిక చరిత్ర
- భారత రాజ్యాంగం
పేపర్-1 నుంచి 150 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 150 మార్కులకు నిర్వహిస్తారు.
పేపర్-2 - భారతదేశ మరియు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ
- సైన్స్ అండ్ టెక్నాలజీ
పేపర్-2 నుంచి 150 ప్రశ్నలు ఉంటాయి ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 150 మార్కులకు నిర్వహిస్తారు.
పేపర్-1 & పేపర్-2 లో వచ్చిన మెరిట్ ని ఆధారంగా చేసుకుని అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
క్రింది PDF లింక్ పై క్లిక్ చేసి సిలబస్ డౌన్లోడ్ చేసుకోండి.
Download PDF