RRB Group D Notification 2026: రైల్వే శాఖలో గ్రూప్ డి (లెవెల్-1) ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 22,195 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. 10వ తరగతి, ఐటిఐ విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 18 నుంచి 33 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంగ్లీష్ భాషతో పాటు తెలుగు భాషలో పరీక్ష ఉంటుంది. సికింద్రాబాద్ రైల్వే జోన్ లో 1,012 ఖాళీలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు సికింద్రాబాద్ రైల్వే జోన్ లో ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..
RRB Group D Notification 2026 Details
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) నుంచి గ్రూప్-డి (లెవెల్-1) ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది.
పోస్టుల వివరాలు
ఈ నోటిఫికేషన్ ద్వారా రైల్వే శాఖలో గ్రూప్ డి లెవెల్-1 పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 22,195 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు సికింద్రాబాద్ రైల్వే జోన్ లో ఉన్న ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. సికింద్రాబాద్ రైల్వే జోన్ లో 1,012 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
విద్యార్హతలు
రైల్వే గ్రూప్ డి ఉద్యోగాలకు 10వ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఐటిఐ విద్యార్హత కలిగిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
RRB Group D Age limit?
రైల్వే శాఖలో గ్రూప్ డి ఉద్యోగాలకు 18 నుంచి 33 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, బీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
జీతం ఎంత ఉంటుంది?
ఈ ఉద్యోగాలు పొందే అభ్యర్థులకు జీతం నెలకు రూ.18,000 ఉంటుంది. జీతంతో పాటు రైల్వే శాఖకు చెందిన అన్ని అలవెన్సులు వర్తిస్తాయి.
సెలక్షన్ ప్రాసెస్
- కంప్యూటర్ బేస్డ్ టెస్ట్
- ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్
- డాక్యుమెంట్స్ వెరిఫికేషన్
- మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు
పరీక్ష విధానం & సిలబస్
కంప్యూటర్ ఆధారిత పరీక్షను 100 మార్కులకు నిర్వహిస్తారు. 100 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. 90 నిమిషాల సమయం ఉంటుంది.
- జనరల్ సైన్స్ నుంచి 25 ప్రశ్నలు
- మ్యాథమెటిక్స్ నుంచి 25 ప్రశ్నలు
- జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 30 ప్రశ్నలు
- జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి 20 ప్రశ్నలు వస్తాయి
- గమనిక: అభ్యర్థులు పూర్తి సిలబస్ వివరాల కొరకు క్రింది నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
పరీక్ష ఫీజు/ దరఖాస్తు ఫీజు
- OC, BC, EWS అభ్యర్థులు రూ.500 ఫీజు చెల్లించాలి
- ఎస్సీ, ఎస్టీ, మహిళలు, PwBD, EBC, మైనారిటీ అభ్యర్థులు రూ.250 ఫీజు చెల్లించాలి.
దరఖాస్తు విధానం
ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు రైల్వే శాఖ అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ముందుగా వెబ్సైట్లో అకౌంట్ క్రియేట్ చేసి.. తర్వాత దరఖాస్తు ఫారం నింపాలి.
RRB Group D Apply Dates
రైల్వే గ్రూప్ డి ఉద్యోగాలకు 31-01-2026 తేదీ నుంచి 02-03-2026 తేదీ లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. మరిన్ని వివరాలకు క్రింది నోటిఫికేషన్ చూడగలరు.

