ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు భర్తీ
ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. గుంటూరు జిల్లా పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సానిటరీ అటెండెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. పదవ తరగతి, డిగ్రీ అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. ఎటువంటి రాత పరీక్ష ఉండదు. మెరిట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వారి కార్యాలయం గుంటూరు జిల్లా నుంచి నోటిఫికేషన్ విడుదలైంది
పోస్టుల వివరాలు
ఈ నోటిఫికేషన్ ద్వారాసానిటరీ అటెండెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 12 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.
- సానిటరీ అటెండెంట్: 06 పోస్టులు
- డేటా ఎంట్రీ ఆపరేటర్: 03 పోస్టులు
- ఫార్మాసిస్ట్: 01 పోస్టులు
- ల్యాబ్ టెక్నీషియన్: 02 పోస్టులు
Age ఎంత ఉండాలి?
18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
విద్యార్హతలు
- శానిటరీ అటెండెంట్: 10వ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది
- డేటా ఎంట్రీ ఆపరేటర్: ఈ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ అర్హతతో పాటు PGDCA కంప్యూటర్ కోర్స్ సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఫార్మసిస్ట్: డి.ఫార్మసీ/ బి.ఫార్మసీ/ ఎం.ఫార్మసీ అర్హతతో పాటు ఏపీ పారామెడికల్ కౌన్సిల్ విభాగంలో రిజిస్టర్ అయి ఉండాలి.
- ల్యాబ్ టెక్నీషియన్: 10వ తరగతి అర్హతతో పాటు డిప్లొమా మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కోర్స్ పూర్తయి.. ఏపీ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అయిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
జీతభత్యాలు
- సానిటరీ అటెండెంట్: రూ.15,000/-
- డేటా ఎంట్రీ ఆపరేటర్: రూ.18,450/-
- ఫార్మాసిస్ట్: రూ.23,393/-
- ల్యాబ్ టెక్నీషియన్: రూ.23,393/-
ఎంపిక విధానం
విద్యార్హతలో వచ్చిన మార్కుల మెరిట్, అనుభవం, ధ్రువపత్రాల పరిశీలన, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు.
దరఖాస్తు ఫీజు
- OC, BC అభ్యర్థులు: రూ.800/-
- SC, ST అభ్యర్థులు: రూ.500/- ఫీజు చెల్లించాలి
దరఖాస్తు విధానం
ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు 02-02-2026 తేదీ లోపు offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
