Anganwadi Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ఎన్టీఆర్ జిల్లాలోని ఆరు ఐసిడిఎస్ ప్రాజెక్టుల్లోని అంగన్వాడి కేంద్రాల్లో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. 10 అంగన్వాడీ కార్యకర్త పోస్టులు, 141 ఆయా పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. 10వ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అంగన్వాడి కార్యకర్త, ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి 21 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపు వయస్సు ఉండాలి. విజయవాడ అర్బన్, విజయవాడ రూరల్, మైలవరం, చిలకల్లు, నందిగామ, తిరువూరు అంగన్వాడీల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేస్తున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 5వ తారీఖు లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఎక్కడైతే ఖాళీ పోస్టు ఉంటుందో.. ఆ ప్రాంతంలో నివాసం ఉన్న స్థానిక వివాహిత మహిళలు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అర్హత, వయసు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..
Anganwadi Jobs Notification Details
పోస్టుల వివరాలు
ఈ నోటిఫికేషన్ ద్వారా అంగన్వాడి టీచర్, అంగన్వాడి హెల్పర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 151 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడ అర్బన్, విజయవాడ రూరల్, మైలవరం, చిలకల్లు, నందిగామ, తిరువూరు అంగన్వాడీల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేస్తున్నారు.
- అంగన్వాడి టీచర్: 10 పోస్టులు
- అంగన్వాడి హెల్పర్: 141 పోస్టులు
విద్యార్హతలు
అంగన్వాడి కార్యకర్త, అంగన్వాడి ఆయా పోస్టులకు 10వ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది.
Anganwadi Jobs Age limit
అంగన్వాడి కార్యకర్త, ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి 21 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపు వయస్సు ఉండాలి.
జీతభత్యాలు
అంగన్వాడి కార్యకర్త పోస్టులకు రూ.11,500; అంగన్వాడి ఆయా పోస్టులకు రూ.7,000 జీతం ఉంటుంది.
సెలక్షన్ ప్రాసెస్
విద్యార్హతలో వచ్చిన మార్కుల మెరిట్, ఇంటర్వ్యూ, అనుభవాన్ని ఆధారంగా చేసుకొని అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు.
దరఖాస్తు విధానం
అంగన్వాడీ టీచర్, అంగన్వాడీ హెల్పర్ పోస్టులకు అర్హత గల మహిళా అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు సంబంధిత ఐసీడీఎస్ కార్యాలయానికి వెళ్లి దరఖాస్తులు తీసుకొని.. తిరిగి అదే ఐసీడీఎస్ కార్యాలయంలో సమర్పించవలెను.
దరఖాస్తుకు చివరి తేదీ
05-02-2026 తేదీ లోపు offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
