AP District Court Jobs Notification Details
AP District Court Jobs: ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టుల్లో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. పాత జిల్లాల ప్రాతిపదికన ఉమ్మడి 13 జిల్లాల్లో ఖాళీలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. రికార్డ్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. 10వ తరగతి, ఏదైనా డిగ్రీ విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. 18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..
పోస్టుల వివరాలు
ఈ నోటిఫికేషన్ ద్వారా రికార్డు అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు మొత్తం 44 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.
- రికార్డ్ అసిస్టెంట్: 18 పోస్టులు
- డేటా ఎంట్రీ ఆపరేటర్: 13 పోస్టులు
- ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్: 13 పోస్టులు
డేటా ఎంట్రీ ఆపరేటర్, ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్ పోస్టులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాల్లో ఖాళీలు ఉన్నాయి. రికార్డ్ అసిస్టెంట్ పోస్టులు ఉమ్మడి చిత్తూరు, అనంతపురం, నెల్లూరు, కర్నూలు, ప్రకాశం, గుంటూరు, తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఖాళీలు ఉన్నాయి. జిల్లాల వారీగా, పోస్టుల భారీగా ఖాళీల వివరాల కొరకు క్రింద ఇవ్వబడిన జిల్లా లింకులపై క్లిక్ చేయండి.
విద్యార్హతలు
- రికార్డ్ అసిస్టెంట్: ఈ ఉద్యోగాలకు 10వ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
- డేటా ఎంట్రీ ఆపరేటర్: ఈ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ అర్హతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం, టైపింగ్ స్కిల్స్ కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్: ఈ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
AP District Court Jobs Age limit
18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరి అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
జీతభత్యాలు
- రికార్డ్ అసిస్టెంట్: ఈ ఉద్యోగాలకు ఎంపిక అయ్యే అభ్యర్థులకు జీతం నెలకు రూ.23,120 నుంచి రూ.74,770 వరకు జీతం ఉంటుంది.
- డేటా ఎంట్రీ ఆపరేటర్: ఈ ఉద్యోగాలకు ఎంపిక అయ్యే అభ్యర్థులకు జీతం నెలకు రూ.28,280 నుంచి రూ.89,720 వరకు జీతం ఉంటుంది.
- ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్: ఈ ఉద్యోగాలకు ఎంపిక అయ్యే అభ్యర్థులకు జీతం నెలకు రూ.25,220 నుంచి రూ.80,910 వరకు జీతం ఉంటుంది.
సెలక్షన్ ప్రాసెస్
- రికార్డ్ అసిస్టెంట్: రాత పరీక్ష ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
- డేటా ఎంట్రీ ఆపరేటర్: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
- ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్: రాత పరీక్ష ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు పరీక్ష ఫీజు
ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు రూ.1000 ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.500 ఫీజు చెల్లించాలి.
దరఖాస్తు విధానం
ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు 27-01-2026 తేదీ లోపు Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు కింద ఇవ్వబడిన తమ జిల్లా వెబ్సైట్ లింక్ పై క్లిక్ చేసి, సంబంధిత నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, అందులో పేర్కొన్న అడ్రస్ లో దరఖాస్తు ఫారాలు సమర్పించవలెను. నోటిఫికేషన్ తో పాటు ఉన్న దరఖాస్తు ఫారాలను ప్రింట్ తీసుకొని అప్లై చేయవలెను.

