TSSPDCL: తెలంగాణ విద్యుత్ శాఖలో 1553 జేఎల్ఎం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. అర్హత, వయస్సు, జీతం, ఎంపిక విధానం..
తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. విద్యుత్ శాఖలో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ TSSPDCL డైరెక్టర్ ప్రాతిపదికన 1,553 జూనియర్ లైన్మెన్ (JLM) ఉద్యోగాల భర్తీకి సంబంధించి సంక్షిప్త ప్రకటనను విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. www.tssouthernpower.com వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. పూర్తిస్థాయి నోటిఫికేషన్ TSSPDCL వెబ్ సైట్ లో ఫిబ్రవరి 15న లేదా ఆ తర్వాత విడుదల చేయనున్నారు.
పోస్టుల వివరాలు:
జూనియర్ లైన్మెన్: 1,553 పోస్టులు
విద్యార్హతలు:
పదో తరగతితో పాటు ఐటిఐ (ఎలక్ట్రికల్ ట్రేడ్/ వైర్ మెన్) లేదా ఇంటర్మీడియట్ ఒకేషనల్ కోర్స్ (ఎలక్ట్రికల్ ట్రేడ్) చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి:
జూనియర్ లైన్మెన్ పోస్టులకు 18 నుంచి 35 సంవత్సరాల లోపు వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
జీతభత్యాలు:
రూ.24,340/- నుంచి రూ.39,405/- వరకు
ఎంపిక విధానం:
రాత పరీక్ష మరియు పోల్ క్లైమ్బింగ్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
క్రింది లింక్ పై క్లిక్ చేసి షార్ట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోగలరు