TSSPDCL: తెలంగాణ విద్యుత్ శాఖలో 1600 పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..
తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మరొక మంచి శుభవార్త తెలిపింది. విద్యుత్ శాఖలో ఉద్యోగాల భర్తీకి తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేశారు. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (SPDCL) లో ఖాళీగా ఉన్న 1,553 జూనియర్ లైన్మెన్ (జేఎల్ఎం), 48 అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) పోస్టులు కలిపి మొత్తం 1,601 పోస్టుల భర్తీకి తక్షణమే నోటిఫికేషన్ జారీ చేయాలని మంత్రి జి.జగదీశ్ రెడ్డి ఆదేశించారు. నిరంతర విద్యుత్ సరఫరాపై మంగళవారం ఆయన మింట్ కాంపౌండ్ లోని తన కార్యాలయంలో ట్రాన్స్కో , జెన్కో సీఎండీ డి.ప్రభాకర్రావు, TSSPDCL సీఎండీ జి.రఘుమారెడ్డితో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగాల భర్తీకి వెంటనే చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
జూనియర్ లైన్ మెన్ (JLM) పోస్టులకు ఐటిఐ (ఎలక్ట్రికల్ ట్రేడ్) విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు, అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు B.Tech/BE ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.