December 20, 2024
Uncategorized

TSPSC Junior Assistant | 5671 జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

తెలంగాణ రాష్ట్రంలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయింది. 5671 పోస్టులను భర్తీ చేస్తున్నారు. వ్యవసాయ శాఖ, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ, విద్యుత్ శాఖ, ఆరోగ్యశాఖ, విద్యాశాఖ, హోమ్ శాఖ, పంచాయతీరాజ్ శాఖ, మైనార్టీ సంక్షేమ శాఖ, రెవెన్యూ శాఖ తదితర శాఖల్లో ఈ ఉద్యోగాల భర్తీ చేపట్టడం జరుగుతోంది. గ్రూప్ 4 నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగాల భర్తీ చేపట్టడం జరిగింది. గ్రూప్-4 విభాగంలో 8039 పోస్టుల భర్తీకి టిఎస్పిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది.
జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు విధానం:
2022 డిసెంబర్ 30 నుండి 2023 జనవరి 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. www.tspsc.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
విద్యార్హతలు:
ఏదైనా డిగ్రీ చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు
వయోపరిమితి:
18 నుంచి 44 సంవత్సరాల లోపు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. BC, SC, ST, EWS అభ్యర్థులకు వయోపరిమితిలో ఐదు సంవత్సరాలు సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం:
రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పరీక్ష విధానం:
రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1 జనరల్ స్టడీస్, పేపర్ -2 సెక్రటేరియల్ ఎబిలిటీస్. ఒక్కో పేపర్ నుంచి 150 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 150 మార్కులకు పరీక్షను నిర్వహిస్తారు. మొత్తం 300 మార్కులకు ఎంపిక ప్రక్రియ ఉంటుంది. పరీక్ష ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ భాషలలో నిర్వహిస్తారు.
క్రింది నోటిఫికేషన్ లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోగలరు, అప్లై ఆన్లైన్ లింక్ పై క్లిక్ చేసి జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగలరు.

Notification Link

Apply Online

Website

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!