TSPSC | ఎక్సైజ్ ఎస్సై పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
తెలంగాణ రాష్ట్రంలో ప్రొబేషన్ & ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు . 97 పోస్టులను భర్తీ చేస్తున్నారు. . గ్రూప్ 2 నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగాల భర్తీ చేపట్టడం జరిగింది. గ్రూప్ 2 విభాగంలో 783 పోస్టుల భర్తీకి టిఎస్పిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఎక్సైజ్ ఎస్సై పోస్టులకు దరఖాస్తు విధానం:
2023 జనవరి 18 నుండి 2023 ఫిబ్రవరి 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. https://www.tspsc.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
విద్యార్హతలు:
ఏదైనా డిగ్రీ చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు
వయోపరిమితి:
2022 జులై 1 నాటికి 21 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. BC, SC, ST, EWS అభ్యర్థులకు వయోపరిమితిలో ఐదు సంవత్సరాలు సడలింపు ఉంటుంది.
జీతం:
రూ.38,890/- నుంచి రూ.1,12,510 వరకు
ఎంపిక విధానం:
రాత పరీక్ష & ఫిజికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఫిజికల్ టెస్ట్ వివరాలు:
పురుషులు: హైట్- 167.6 cm
చెస్ట్- 86.3 cm (ఊపిరి పీల్చినప్పుడు 5 cm పెరగాలి)
మహిళలు: హైట్- 152.5 cm
ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న ఎస్టీ స్త్రీ, పురుష అభ్యర్థులకు కొలతల్లో సడలింపు ఉంటుంది.
పరీక్ష విధానం:
నాలుగు పేపర్లు ఉంటాయి. పేపర్-1: జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ
పేపర్ -2: హిస్టరీ, పాలిటి అండ్ సొసైటీ
పేపర్-3: ఎకానమీ అండ్ డెవలప్మెంట్.
పేపర్-4: తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్ర ఏర్పాటు
ఒక్కో పేపర్ నుంచి 150 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 150 మార్కులకు పరీక్షను నిర్వహిస్తారు. మొత్తం 600 మార్కులకు ఎంపిక ప్రక్రియ ఉంటుంది. పరీక్ష ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ భాషలలో నిర్వహిస్తారు.
క్రింది నోటిఫికేషన్ లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోగలరు.