TSPSC Group 4 | గ్రూప్-4 కు భారీ పోటీ..తొలి పది రోజుల్లో ఎన్ని లక్షల మంది అప్లై చేశారంటే?
తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-4 ఉద్యోగాలకి భారీ స్థాయిలో దరఖాస్తులు వస్తున్నాయి. ఆదివారం సాయంత్రం నాటికి 2,48,955 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తులు భారీగా పెరిగే ఛాన్స్ ఉంది. కొన్నేళ్ల తర్వాత గ్రూప్-4 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడంతో నిరుద్యోగులు భారీగా దరఖాస్తు చేసుకుంటున్నారు. రోజురోజుకు దరఖాస్తులు భారీగా పెరుగుతున్నాయి. ప్రతిరోజు 30 వేలకు పైగానే అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటున్నారు. గ్రూప్-4 విభాగంలో 8,039 పోస్టులు భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు ఈనెల 30వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించవచ్చు. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.