TSPSC Group-2: గ్రూప్-2 ఒక్కో పోస్టుకు 705 మంది పోటీ.. ఎన్ని లక్షలమంది దరఖాస్తు చేశారంటే?
తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-2 ఉద్యోగాల దరఖాస్తు గడువు గురువారం సాయంత్రం ఐదు గంటలకు ముగిసింది. మొత్తం 783 పోస్టులకు TSPSC ద్వారా నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు గడువు ముగిసే సమయానికి 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు టిఎస్పిఎస్సి వెల్లడించింది. ఒక్కో పోస్టుకు సగటున 705 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. చివరి రోజు 68 వేలకు పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 2023 జనవరి 18 నుంచి 2023 ఫిబ్రవరి 16 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. నిన్నటితో దరఖాస్తు గడువు ముగిసింది.
పరీక్షల నిర్వహణ తేదీపై వచ్చేవారం నిర్ణయం..
గ్రూప్-2 దరఖాస్తు గడువు ముగియడంతో పరీక్ష తేదీల ఖరారు పై టీఎస్పీఎస్సీ దృష్టి పెట్టింది. పరీక్షల నిర్వహణ తేదీ పై వచ్చే వారం నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని టీఎస్పీఎస్సీ తెలిపింది.