TSPSC: గ్రూప్-2 అభ్యర్థులకు అవగాహన సదస్సు..
తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-2 పరీక్షల నిర్వహణపై టీఎస్పీఎస్సీ ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. 2023 ఆగస్టు 29, 30 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. గ్రూప్-2 పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు కృష్ణ ప్రదీప్ 21 సెంచరీ ఐఏఎస్ అకాడమీ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 5వ తేదీన ఉదయం 10 గంటల నుంచి అశోక్ నగర్ అకాడమీలో ఉచిత అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సదస్సులో సీనియర్ అధ్యాపకులు సిలబస్, ప్రిపరేషన్ స్ట్రాటజీ, నోట్స్ మేకింగ్, సమయ పాలన తదితర అంశాలపై సమగ్ర అవగాహన కల్పిస్తారని వివరించారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ సదస్సుకు హాజరవ్వాలని కోరారు. వివరాలకు 9133237733, 040 35052121 నంబర్లలో సంప్రదించాలని అకాడమీ చైర్మన్ సూచించారు.