December 7, 2024
TS Govt Jobs

TSPSC Group 2: గ్రూప్-2 పరీక్షలు రీషెడ్యూల్?

TSPSC Group 2 Recruitment: తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల అభ్యర్థన మేరకు గ్రూప్-2 పరీక్షలను మరోసారి రీ షెడ్యూల్ చేసే అవకాశాలున్నట్లు సమాచారం.

Telegram Group Link

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-2 పరీక్షలను మరోసారి రీ షెడ్యూల్ చేసే అవకాశాలున్నట్లు సమాచారం. గతంలో గ్రూప్-2 పరీక్షలను టీఎస్పీఎస్సీ తొలుత 2023 ఆగస్టు 29, 30 తేదీల్లో నిర్వహించాలని భావించింది. నిరుద్యోగుల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు నవంబరు 2, 3 తేదీలకు రీషెడ్యూల్ చేసింది. నవంబరు 3 నుంచి అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ చేపట్టడంతో 2024 జనవరి 6, 7 తేదీలకు పరీక్షలు రీషెడ్యూల్ అయ్యాయి. అయితే, కొత్త బోర్డు ఏర్పాటు తరువాతే పరీక్షలు నిర్వహించాలని, వచ్చే నెలలో జరగాల్సినవి మరోసారి రీషెడ్యూలు చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈమేరకు రీషెడ్యూల్ చేసే అవకాశాలున్నట్లు సమాచారం. మొత్తం 783 గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఒక్కో పోస్టుకు సగటున 705 మంది పోటీ పడుతున్నారు.

Download Our App

Telegram Group Link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!