TSPSC: మూడు పరీక్షల కొత్త తేదీలు ప్రకటన.. ‘మే’ లో పరీక్షలు
తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్న పత్రాల లీకేజీ కారణంగా రద్దయిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (AEE) నియామక పరీక్షల తేదీలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ప్రకటించింది. మే 8న ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కంప్యూటర్ ఆధారిత పరీక్ష, మే 9న అగ్రికల్చర్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ ఆధారిత పరీక్షలు, మే 21న సివిల్ ఏఈఈ ఓఎంఆర్ ఆధారిత పరీక్ష నిర్వహించిననున్నట్లు వెల్లడించింది. ఈ ఏడాది జనవరి 22న ఏఈఈ పరీక్షను టీఎస్పీఎస్సీ నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే, ప్రశ్నపత్రాల లీకేజీతో ఈ పరీక్షలను రద్దు చేసింది. నియామక పరీక్ష తేదీలను టీఎస్పీఎస్సీ తాజాగా ప్రకటించింది.
క్రింది పట్టిక ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోగలరు