December 9, 2024
AP Govt Jobs

AP District Court Results 2023: ఏపీ జిల్లా కోర్టు ఉద్యోగాల రాతపరీక్ష ఫలితాలు విడుదల.. ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా కోర్టు ఉద్యోగాల రాత పరీక్ష ఫలితాలు విడుదల చేశారు. జిల్లా కోర్టుల్లో మొత్తం 3,546 ఉద్యోగాల భర్తీకి హైకోర్టు చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాల ఫలితాలు మార్చి 29న వెల్లడయ్యాయి. నియామకాల్లో భాగంగా 2022 డిసెంబర్ 22 నుంచి 2023 జనవరి 2 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించారు. జనవరి 4న కీని విడుదల చేశారు. ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్థుల వివరాలు అధికారిక వెబ్సైట్లో ఉంచారు. ఈ ఉద్యోగ ప్రకటన ద్వారా రికార్డ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, జూనియర్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, స్టెనోగ్రాఫర్, టైపిస్టు, కాపీయిస్టు, డ్రైవర్ ఖాళీలు భర్తీ కానున్నాయి. ఎంపికైన అభ్యర్థులు ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకావాల్సి ఉంటుంది. స్టెనోగ్రాఫర్, టైపిస్టు, కాపీయిస్టు పోస్టులకు ఎంపికైన వారికి స్కిల్ టెస్టు, డ్రైవర్ పోస్టులకు ఎంపికైన వారికి డ్రైవింగ్ టెస్టును అదనంగా నిర్వహిస్తారు.

క్రింది లింక్ పై క్లిక్ చేసి మీకు కావాల్సిన ఫలితాలు డౌన్లోడ్ చేసుకోగలరు

జూనియర్ అసిస్టెంట్

ఆఫీస్ సబార్డినేట్

ప్రాసెస్ సర్వర్

ఫీల్డ్ అసిస్టెంట్

ఎగ్జామినర్

రికార్డ్ అసిస్టెంట్

స్టెనోగ్రాఫర్

టైపిస్ట్

కాపీయిస్ట్

డ్రైవర్

స్కోర్ కార్డు కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి

Score Card

Official Website

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!