TS Police Jobs: ఎస్సై కానిస్టేబుల్ అభ్యర్థులకు శుభవార్త.. ఈవెంట్స్ కు మరొక్క ఛాన్స్

WhatsApp Group Join Now
Telegram Group Join Now

తెలంగాణ రాష్ట్రంలో పోలీసు కానిస్టేబుల్ మరియు ఎస్ఐ అభ్యర్థులకు TSLPRB మరో మంచి శుభవార్త తెలిపింది. ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఇప్పటికే ఫిజికల్ ఈవెంట్స్ ముగిశాయి. కేవలం మెయిన్స్ పరీక్షలు మాత్రమే మిగిలాయి. అయితే ఫిజికల్ ఈవెంట్స్ లో ఎత్తు విషయంలో క్వాలిఫై కాలేకపోయిన చాలా మంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో 1 సెంటిమీటర్, అంత కంటే తక్కువ ఎత్తులో డిస్క్వాలిఫై అయిన అభ్యర్థులకు మరోసారి అవకాశం కల్పించాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ స్టేట్ లెవల్ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు TSLPRB కీలక నిర్ణయం తీసుకుంది. 1 సెంటిమీటర్, అంత కంటే తక్కువ ఎత్తులో డిస్క్వాలిఫై అయిన అభ్యర్థులకు మరోసారి ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది.
మొత్తం రెండు ప్రాంతాల్లో ఎత్తు కొలతకు సంబంధించిన ఈవెంట్స్ నిర్వహించనున్నారు. అంబర్పేట పోలీసు గ్రౌండ్స్, కొండాపూర్ 8వ బెటాలియన్లో ఈవెంట్స్ నిర్వహించనున్నారు. ఎత్తు విషయంలో డిస్క్వాలిఫై అయిన అభ్యర్థులు మరోసారి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఫిబ్రవరి 10 ఉదయం 8 గంటల నుంచి 12 వ తేదీ రాత్రి 8 గంటల వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించారు. అర్హత కలిగిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోగలరు. దరఖాస్తు ఫారం సమర్పించిన వారు వెబ్సైట్లో అప్లికేషన్ కం అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకొని ఈవెంట్స్ కు హాజరు కావాల్సి ఉంటుంది.

UPSC IFS Recruitment 2026
అటవీ శాఖలో ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | UPSC IFS Recruitment 2026 | Apply Online

TS High Court Recruitment: తెలంగాణ హైకోర్టులో డ్రైవర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

error: Content is protected !!