TS SI Constable Recruitment 2023: గుడ్ న్యూస్.. అభ్యర్థి లేకున్నా సరే సర్టిఫికేట్స్ వేరిఫికేషన్
తెలంగాణ రాష్ట్రంలో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియలో భాగంగా అభ్యర్థుల ధ్రువీకరణపత్రాల పరిశీలనలో తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీసు నియామక మండలి (TSLPRB) వెసులుబాటు కల్పించింది. అత్యవసర పరిస్థితుల్లో అభ్యర్థి రాకున్నా సరే ధ్రువీకరణపత్రాల్ని పరిశీలించాలని నిర్ణయించింది. అయితే ఆ అత్యవసర పరిస్థితిని తెలిపే ఆధారాలను మాత్రం తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుంది. ఆ పరిస్థితిని వివరిస్తూ అభ్యర్థియే స్వయంగా దరఖాస్తు రాసి రక్తసంబంధీకులతో పంపిస్తే సరిపోతుంది. అది సరైనదే అని మండలి వర్గాలు భావిస్తే ఆ ధ్రువీకరణ పత్రాలను పరిశీలించనుంది. ఈనెల 14 నుంచి 26 వరకు రాష్ట్రవ్యాప్తంగా 18 కేంద్రాల్లో 1,09,906 మంది అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాలను పరిశీలించనున్నారు. ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు సంబంధించిన ఇంటిమేషన్ లెటర్లను అభ్యర్థులు తెలంగాణ పోలీస్ నియామక మండలి వెబ్సైట్ నుండి జూన్ 11 నుంచి జూన్ 13 రాత్రి 8 గంటల వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి