TSLPRB: కానిస్టేబుల్ అభ్యర్థులకు మార్చి 2 నుంచి ట్రేడ్ టెస్టులు నిర్వహణ..
పోలీస్ ట్రాన్స్ పోర్టు కానిస్టేబుల్ అభ్యర్థులకు డ్రైవింగ్, మెకానిక్ ట్రేడ్ టెస్టులు మార్చి 2 నుంచి నిర్వహించను న్నట్లు పోలీస్ నియామక మండలి తెలిపింది. వీరితోపాటు విపత్తు నిర్వహణ, అగ్నిమాపక విభాగంలో డ్రైవర్ పోస్టులకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. పోలీస్ నియామక ప్రక్రియలో భాగంగా శరీర దారుఢ్య పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు డ్రైవింగ్, ట్రేడ్ పరీక్షలు నిర్వ హిస్తున్నారు. మార్చి 2 నుంచి 21 వరకు డ్రైవింగ్, ట్రేడ్ టెస్టులు నిర్వహిస్తారు. హైదరాబాద్ అంబర్పేట్ పోలీస్ మైదానంలో పరీక్షలు జరుగుతాయి. ట్రేడ్ టెస్టులకు సంబంధించిన అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవడానికి ఈనెల 25 ఉదయం 8 గంటల నుంచి ఈ నెల 28 అర్ధరాత్రి వరకు డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించింది. www.tslprb.in వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలని సూచించింది. అడ్మిట్ కార్డుల డౌన్లోడ్లో ఏవైనా ఇబ్బందులు తలెత్తితే support@tslprb.in కు ఈ-మెయిల్ ద్వారా సమాచారమివ్వడం లేదా 9393711110 లేదా 9391005006 నంబర్లకు ఫోన్ చేసి సంప్రదించాలని తెలిపింది.
క్రింది PDF లింక్ పై క్లిక్ చేసి పూర్తి వివరాలు పొందగలరు