TS Inter Results 2026: తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వార్షిక ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. ఇంటర్మీడియట్ ఫలితాలను ఈనెల 12న విడుదల చేయనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు అధికారికంగా వెల్లడించింది. ఇంటర్మీడియట్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను ఆదివారం మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు విడుదల చేసేందుకు బోర్డు సిద్ధం చేసింది.
ఇంటర్మీడియట్ పరీక్షలు ఫిబ్రవరి 25న ప్రారంభమై మార్చి 18న ముగిసిన విషయం తెలిసిందే. పరీక్షలకు మొత్తం తొమ్మిది లక్షల 9,97,075 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో ఇంటర్మీడియట్ ఫస్టియర్ సంబంధించి 4,89,126 మంది హాజరైతే, ఇంటర్మీడియట్ సెకండియర్ సంబంధించి 5,07,949 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. అభ్యర్థులు ఫలితాలు విడుదల చేసిన తర్వాత ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్సైట్ tgbie.cgg.govin ద్వారా ఫలితాలు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
క్రింది వెబ్సైట్ లింక్ పై క్లిక్ చేసి ఫలితాలు డౌన్లోడ్ చేసుకోండి

